ENGLISH

గ్లామ్‌షాట్‌: 'కిర్రాకు' పోజులో క్రేజీ బ్యూటీ!

15 June 2019-16:00 PM

రష్మికాకి ఇప్పుడు టాలీవుడ్‌లో బోలెడంత క్రేజ్‌ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.'ఛలో'తో తెరంగేట్రం చేసి, 'గీత గోవిందం'తో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. కుర్ర హీరోలకు ఆప్షన్‌ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్‌ హీరోల కంట్లోనూ పడింది. ఒక్కరు కాదు, ఏకంగా ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాల్లో ఆల్రెడీ ఛాన్స్‌ దక్కించేసుకుంది. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మికా హీరోయిన్‌ అన్న సంగతి తెలిసిందే. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలోనూ ఈ క్రేజీ భామనే హీరోయిన్‌.

 

ఇటీవలే లాంఛ్‌ అయిన నితిన్‌ 'భీష్మ' సినిమాలోనూ రష్మిక నటిస్తోంది. త్వరలో 'డియర్‌ కామ్రేడ్‌'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజా పిక్‌ విషయానికి వస్తే, చేతినిండా ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నా స్పెషల్‌ ఫోటో షూట్‌లో పాల్గొంది చూశారు కదా. అదీ రష్మికా అంటే. యూత్‌లో పిచ్చ క్రేజ్‌ ఉన్న రష్మికా ఈ పోజుకి కిర్రాకు రెస్పాన్స్‌ వస్తోంది. పిక్‌లో ఏం లేదు కానీ, నాలుక బయటపెట్టి, కొంటెగా రష్మికా ఇచ్చిన పోజే కెవ్వుకేక మరి. రష్మికా ఎక్స్‌ప్రెషన్‌కి, పక్కనే ఉన్న టేబుల్‌ ల్యాంప్‌ తొంగి తొంగి చూస్తూ కళ్లు మరింత పెద్దవి చేసి ఇంకాస్త కాంతులీనాలని చూస్తున్నట్లుగా ఉందీ లుక్‌.

ALSO READ: Rashmika Mandanna Gallery