టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హీరో ఎవరంటే... టక్కున రవితేజ పేరే చెప్పాలి. ఎందుకంటే... రవితేజ చేతిలో అన్ని సినిమాలున్నాయిప్పుడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర... ఇలా చేతి నిండా సినిమాలతో తలమునకలై ఉన్నాడు. ప్రతీ సినిమాకీ కొన్ని డేట్లు సర్దుబాటు చేస్తూ.. ఒక్కో సినిమానీ మెల్లగా పూర్తి చేస్తున్నాడు. కానీ ఎప్పుడో మొదలైన `ఖిలాడి`ని మాత్రం రవితేజ పట్టించుకోవడం లేదని టాక్.
రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా `ఖిలాడి`. ఈ యేడాదే విడుదల కావాలి. కొన్ని రిలీజ్ డేట్లు ప్రకటించడం, ఆ తరవాత వాయిదా వేయడం... పరిపాటి అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా పూర్తి కాలేదు. కారణం.. ఖిలాడికి సంబంధించి ఓ ఫారెన్ షెడ్యూల్ బాకీ ఉంది. ఇప్పట్లో ఫారెన్ లో షూటింగ్ అంటే అయ్యే పని కాదు. పైగా.. కనీసం 15 రోజులైనా అక్కడ షూటింగ్ చేయాలి. అది చాలా కీలకమైన పార్ట్. కంటిన్యుటీ షాట్లు ఉండడంతో... షూటింగ్ ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడే చేయాలి. అదేమో... పూర్తవ్వడం లేదు. ఈలోగా రవితేజ మిగిలిన సినిమాలతో బిజీ అయిపోయాడు. తన దృష్టి రామారావు, ధమాకాలపై ఉంది. ఈ రెండు సినిమాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది రవితేజ ఉద్దేశ్యం. వీటి మధ్య ఖిలాడీకి కూడా కొన్ని డేట్లు ఇవ్వాలని రమేష్ వర్మ రవితేజ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాడట. మరి ఈ సినిమాకి మోక్షం ఎప్పుడో?
ALSO READ: 'లూప్'లో పడిపోయిన గీతా ఆర్ట్స్