ENGLISH

పుష్ష రూటులోనే... రామారావు?

14 July 2021-14:30 PM

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష‌`. ఇది ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే క‌థ అని.. చిత్ర‌బృందం ముందే చెప్పింది. ఆమ‌ధ్య విడుద‌ల చేసిన టీజ‌ర్ లో కూడా అదే క‌నిపించింది. ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో న‌డ‌వ‌బోతోంద‌ని టాక్‌. అదే.. `రామారావు`. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా శరత్ మాండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కింది. ఇందులో ర‌వితేజ ప్ర‌భుత్వ అధికారికా క‌నిపించ‌నున్నాడు. అయితే ఇది కూడా ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది.

 

కొంత‌మంది ప్ర‌భుత్వాధికారులు, రాజ‌కీయ నేత‌లూ క‌లిసి ఎర్ర‌చంద‌నం స్వాహా చేస్తుంటే.. వాళ్ల‌ని ప‌ట్టుకునే అధికారిగా ర‌వితేజ క‌నిపిస్తాడ‌ని స‌మాచారం అందుతోంది. టైటిల్ లోగోలో మేక‌వ‌న్నె పులి బొమ్మ క‌నిపిస్తోంది. దానికీ అర్థాన్ని వెదికేస్తున్నారు సినీ విశ్లేష‌కులు. ఆ మేక‌వ‌న్నె పులి.. హీరో పాత్ర తాలుకూ స్వ‌భావం అని, త‌న పాత్ర‌లో రెండు విభిన్న కోణాలుంటాయ‌ని, దానికి ఇది సింబ‌ల్ అని అంటున్నారు. మొత్తానికి టైటిల్, ఫ‌స్ట్ లుక్ తోనే కాకుండా... లోగోతో కూడా ఆస‌క్తిని రేకెత్తించాడు ర‌వితేజ‌.

ALSO READ: అట‌కెక్కిన అనుష్క సినిమా?