ENGLISH

ఫ్లాపే.. కానీ ఓటీటీ మాత్రం బ్లాస్ట్!

12 November 2020-12:00 PM

ఓటీటీ అంటే.. ఫ్లాప్ సినిమాలు కేరాఫ్ అడ్ర‌స్స్ అన్న‌ట్టు మారిపోయింది వ్య‌వ‌హారం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఓటీటీలో విడుద‌లైన సినిమాల‌న్నీ ఫ్లాపే. ఒక‌ట్రెండు బాగానే ఉన్నాయి అనిపించినా, వ్యూస్ ప‌రంగా ఓటీటీలో పెద్ద‌గా నిల‌బ‌డ‌లేదు. ఇటీవ‌ల ఓటీటీలోనే విడుద‌లైన మ‌రో సినిమా `లక్ష్మీ`. అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి లారెన్స్ ద‌ర్శ‌కుడు. అయితే.. ఈసినిమాకి చెత్త రేటింగులు వ‌చ్చాయి.

 

ఈ సినిమా చూడ‌డం వృధా కాల‌యాప‌న అని విశ్లేష‌కులు తేల్చేశారు. కానీ... ఓటీటీ ప‌రంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ చిత్రం. ఓటీటీలో విడుద‌లైన సినిమాల్లో.. అత్య‌ధిక వ్యూస్ ఈ చిత్రానికే ద‌క్కాయి. ఓటీటీలో అత్య‌ధిక వీక్ష‌ణ‌లు పొందిన చిత్రంగా `దిల్ బెచారా` రికార్డుని `ల‌క్ష్మీ` దాటేసింద‌ని టాక్‌. డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌లైన ఈ చిత్రం... ఆ ఓటీటీకి పెద్ద ప్ల‌స్ గా మారింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నా.. అక్ష‌య్ కుమార్ కోసం ఈ ఛాన‌ల్ ని స‌బ్ స్క్రెబ్ చేసుకున్న వాళ్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

ALSO READ: 15 ఏళ్ల‌కు రీమేక్ చేస్తున్నారా?