ENGLISH

తల్లిగా రెజినా!

28 September 2017-18:51 PM

ఈ హెడ్డింగ్ చూసి రెజినా తల్లి పాత్ర చేయబోతుంది అని ఫిక్స్ అవ్వకండి. మరి.. ఇంకేంటి అని కంగారుపడకండి. వివరాలు ఈ క్రింద చదవండి-

ఈ మధ్యనే రెజినా ఒక చిన్న బాబుని దత్తత తీసుకోవడంతో తన నిజజీవితంలో తల్లి పాత్రలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా అందరితో పంచుకుంది. ఆ బాబు పేరు జోయెల్లె డేనియల్ అని తెలిపింది.

అకస్మాత్తుగా ఈ తల్లి పాత్రలోకి రావడం చాలా ఆసక్తిగా ఉంది అంటూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. ఇక రెజినా ఇలా దత్తత తీసుకోవడమేంటి అంటూ అందరు ఆశ్చర్యపోతున్నారు.

అయితే దీనిక గల కారణాలు ఏమైనా కాని తాను ఒక మంచి పనిచేసింది అంటూ తనకి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తున్నది.
 

 

 

ALSO READ: స్పైడర్ మొదటిరోజు కలెక్షన్స్ ఇవే!