ENGLISH

ఇంత‌మందిని వెదికి.. రెజీనాని ప‌ట్టారా?

26 July 2021-14:00 PM

తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరో. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌లే.. ఈసినిమాకి క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా చాలామంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే.. చిత్ర‌బృందం మాత్రం `మా సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ న‌టిస్తోంది` అని చెబుతూ వ‌చ్చింది. చివ‌రికి ఛ‌త్ర‌ప‌తి లో హీరోయిన్ గా రెజీనాని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

 

రెజీనా రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర‌లు చేసి చాలా కాలం అయ్యింది. పైగా ఫామ్ లో లేదాయె. అలాంటిది రెజీనాని ఎంచుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. రెజీనానే ప్ర‌ధాన క‌థానాయిక‌నా? మ‌రో హీరోయిన్ ని తీసుకుంటారా? అనే అనుమానాలూ ఉన్నాయి. ఛ‌త్ర‌ప‌తి క‌థ ప్ర‌కారం ఒకే క‌థానాయిక‌. మ‌రి రెజీనాని ఎంచుకున్నారంటే.. త‌నే సోలో హీరోయిన్ గా ఫిక్స‌యిన‌ట్టు అనుకోవాలి.

 

ఇది వ‌ర‌కు కూడా ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రన్న విష‌యంలో చాలా ప్ర‌చారం జ‌రిగింది. చాలామంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ అవ‌న్నీ రూమ‌ర్లే అని తేలిపోయాయి. మ‌రి రెజీనా విష‌యంలో అయినా ఇది నిజ‌మేనా? లేదంటే ఇది కూడా రూమ‌రేనా? అనే విష‌యాలు తెలియాలంటే చిత్ర‌బృందం స్పందించాల్సిందే.

ALSO READ: Regina Latest Photoshoot