ENGLISH

రెండవ పెళ్ళి పై రేణు దేశాయ్ పోస్ట్ రేపిన కలకలం

04 October 2017-11:48 AM

'బద్రి', 'జానీ' సినిమాలతో హీరోయిన్‌గా సుపరిచితురాలైన ముద్దుగుమ్మ రేణూ దేశాయ్‌. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ని వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే ఆ వివాహ బంధం తెగిపోయి కూడా చాలా కాలమే అయ్యిందనుకోంది. ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగానే ఉంది. అయితే మోడలింగ్‌, నిర్మాణ పనులు, ఇతరత్రా వ్యవహారాలతో బిజీగా ఉంది. కానీ వెండితెరకు మాత్రం దూరంగానే ఉండిపోయింది. పవన్‌ కళ్యాణ్‌తో విడాకులు తీసుకుని మాజీ భార్య అయినప్పటికీ, ఆమె అంటే పవన్‌ ఫ్యాన్స్‌కి విపరీతమైన అభిమానం. 'వదినమ్మా' అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూనే ఉంటారు ఇప్పటికీ. సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది కూడా రేణూ దేశాయ్‌. అయితే తాజాగా రేణూ దేశాయ్‌ బుల్లితెరపై ఓ డాన్స్‌ ప్రోగ్రాంకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె రీ ఎంట్రీకి సంబంధించి, కొన్ని ఇంటర్వ్యూల్లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. ఆ ఇంటర్వ్యూస్‌లో ఆమె తన జీవితంలోని అనుభవాలను, మీడియా ముఖంగా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అందులో భాగంగా, పవన్‌ కళ్యాణ్‌తో విడిపోయాక మీకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా? అని రేణూ దేశాయ్‌ని అడిగితే, ఒకానొక టైంలో క్లిష్టమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అయ్యో? నాకూ ఓ తోడుంటే బావుండనిపించింది.. పిల్లలకు కొంచెం హెల్ప్‌గా ఉండేది.. అనిపించింది.. ఇది సహజమే కదా అని ఆమె తెలిపింది. ఇందుకు బదులుగా సోషల్‌ మీడియా వేదికగా ఆమెను పవన్‌ ఫ్యాన్స్‌ ధూషించడం మొదలెట్టారు. అది భావ్యం కాదు కదా. పవన్‌తో విడాకులు తీసుకున్నాక ఆమె రెండో పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది ఆమె పర్సనల్‌ ఇష్యూ. దాంట్లో ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు, అధికారం లేదని పవన్‌ ఫ్యాన్స్‌ గమనించాలి.

ALSO READ: బిగ్ బాస్ సీజన్ 2కి ఎన్టీఆర్ ‘NO’ చెప్పాడా?