ENGLISH

రేణూదేశాయ్‌.. పాన్ ఇండియా సినిమా

15 October 2020-15:33 PM

రేణూ దేశాయ్ రీ ఎంట్రీ గురించి టాలీవుడ్ లో చ‌ర్చ జ‌రుగుతూనే వుంది. ఓ మంచి క‌థ వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా న‌టిస్తా.. అని రేణూ చెబుతూనే వుంది. అందుకు ముహూర్తం సిద్ధ‌మైంది. ఎం.ఆర్‌.కృష్ణ చెప్పిన క‌థ‌కు రేణూ ఓకే చెప్పారు. దీనికి `ఆద్య‌` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

 

డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాత రజనీకాంత్.ఎస్ తెలిపారు.

ALSO READ: తొందరేమీ లేదంటున్న అనుష్క