ENGLISH

సన్నీలియోన్‌ అంటే వర్మకి ఎంతిష్టమో!

19 August 2017-16:29 PM

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ టాలీవుడ్‌ ప్రముఖుల మీద కామెంట్స్‌ వేస్తూ ఉంటాడు ఎప్పుడూ. ఇప్పుడు కొత్తగా ఆయన ఫోకస్‌ మలయాళ నటులపై పెట్టినట్లున్నాడు. మలయాళ స్టార్‌ హీరోలైన ముమ్ముట్టి, మోహన్‌లాల్‌ని టార్గెట్‌ చేసి ట్వీట్లు పెట్టాడు. అసలు సంగతి ఏంటంటారా? మొన్నీ మధ్యనే ఓ మొబైల్‌ కంపెనీ ప్రారంభోత్సవానికి బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ కేరళలోని కొచ్చి వెళ్లారు. అక్కడ సన్నీలియోన్‌ని చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. ఆమెను చూసేందుకు వచ్చిన వేలాది మంది జనంతో అక్కడ ట్రాపిక్‌ ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమే. ఆ పరిస్థితుల్లో ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేయడం చాలా ఇబ్బందయ్యింది అక్కడి పోలీసులకి. ఇదంతా సరే. ఇంతటి అభిమానం తనపై చూపించినందుకు ఆనందంతో సన్నీ లియోన్‌ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. సోషల్‌ మీడియా ద్వారా కేరళ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలిపింది సన్నీ. ఇంతకీ వర్మ సంగతేంటనే కదా మీ అనుమానం. సన్నీ లియోన్‌ విషయంలో వర్మ కొంచెం ఎక్కువగానే స్పందిస్తూ ఉంటారు. గతంలోనూ సన్నీ విషయంలో ఎక్కువగా స్పందించి వివాదాల్లోకెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడేంటంటే సన్నీని చూడ్డానికి వచ్చిన అంత మంది జనాన్ని చూసి మలయాళ హీరోలు ముమ్ముట్టి, మోహన్‌లాల్‌ అసూయతో ఏడుస్తారు. ఎందుకంటే అక్కడి స్టార్స్‌ అయిన వాళ్లని చూసేందుకు ఎప్పుడూ అంత మంది జనం రాలేదని..' అంటూ వర్మ ట్వీట్‌ చేశారు. ఏది ఏమైనా వర్మ తన కామెంట్స్‌తో భలే ఫన్‌ జనరేట్‌ చేస్తూ ఉంటారులే!

ALSO READ: సెట్స్‌ మీదికి వెళ్లనున్న కేసీఆర్‌ సినిమా