ENGLISH

హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్ట్ నిజా నిజాలు

20 October 2024-12:09 PM

గత కొన్ని రోజులుగా యూట్యూబర్‌ హర్షసాయి వివాదం నడుస్తూనే ఉంది. హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని మోసం చేసాడని బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్రాశర్మ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన హర్ష సాయి పరారీలో ఉన్నాడు. హర్ష సాయి దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో బాధితురాలు ఆడియో కాల్స్ ఇవే నంటూ సొషల్ మీడియాలో కొన్ని లీక్ చేసారు. హర్ష సాయి కొంత మంది యూట్యూబర్లకి మనీ ఇచ్చి ఇలా చేయిస్తున్నాడని బాధితురాలు ఆరోపించి, హర్ష సాయిని సపోర్ట్ చేస్తున్న వారిపై కూడా కేసు ఫైల్ చేయించింది. 


ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖ‌ర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.  హర్ష సాయి బాధితురాలు ఆర్జే శేఖర్ భాషా యూట్యూబ్ ఛానల్స్‌ లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్  చేసిందని దీనితో శేఖర్ భాషాని అదుపులోకి తీసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ ఆఫీస్ లో విచారణ చేపట్టారని, ఎక్కడ చూసిన ఇదే వార్త వినిపించింది. ఈ మధ్య శేఖర్ భాషా చాలా వివాదాల్లో నలుగుతున్నారు. తనకి కానివి కూడా తన నెత్తిపై వేసుకుని ఇప్పుడు ఇలా అరెస్ట్ అయ్యారు. ముందు రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో తల దూర్చాడు. ఈ వివాదంలో రాజ్ తరుణ్ కంటే శేఖర్ ఎక్కువగా తన గొంతు వినిపించారు. పలు టీవీ షో లో డిబేట్లలో పాల్గొని రాజ్ తరుణ్ ని సపోర్ట్ చేసారు. దీనితో శేఖర్ ఫేమస్ అయిపోయాడు. వెంటనే బిగ్ బాస్ ఆఫర్ రాగా హౌస్ లోకి వెళ్ళాడు. కానీ తనకి తానే సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చేసాడు. వచ్చిన వెంటనే హర్ష సాయి వివాదంలో వేలు పెట్టాడు. చివరికి ఇలా అరెస్ట్ అయ్యాడని ఫాన్స్ కంగారు పడ్డారు.


ఇంతలోనే శేఖర్ భాషా ఒక వీడియో రిలీజ్ చేశారు. తనని అరెస్ట్ చేసి నట్లు వస్తున్నవార్తలు అవాస్తవమని, తాను ప్రో కబడ్డీ లీగ్ చూడటానికి గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లినట్లు, త్రీ అవర్స్ అక్కడే ఉన్నానని, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని, అంతలోనే తన అరెస్ట్, విచారణ అని తప్పుడు వార్తలు సృష్టించారని, తాను తన ఇంట్లోనే ఉన్నట్లు , ఫాన్స్ ని కంగారు పడొద్దని ఒక వీడియో పోస్ట్ చేసాడు.