ENGLISH

ఎన్టీఆర్‌, చరణ్‌.. ‘ఆ నిర్ణయం’ తీసేసుకున్నారట

16 September 2020-15:00 PM

రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏళ్ళ తరబడి సినిమా షూటింగ్‌ జరుగుతుంది. రిజల్ట్‌ కూడా అలాగే వుంటుంది మరి.! ‘బాహుబలి’ విషయంలో ఏం జరిగిందో చూశాం కదా. ఆ స్థాయిలో కాదు, కాస్త వేగంగానే ‘ఆర్ఆర్ఆర్‌’ పూర్తి చేస్తానని ‘ఆర్ఆర్ఆర్‌’ ప్రారంభోత్సవంలో చెప్పాడు రాజమౌళి. కానీ, కరోనా సహా అనేక కారణాలతో ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా షూటింగ్‌ అనుకున్న విధంగా జరగడంలేదు. వచ్చే ఏడాది సమ్మర్‌కి కూడా ‘ఆర్ఆర్ఆర్‌’ వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్‌ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. అయితే, షూటింగ్‌ ప్రారంభమయ్యాక మాత్రం శరవేగంగా సినిమాని పూర్తి చేయాలని రాజమౌళి అనుకుంటున్నాడట. అందుకు తగ్గ ప్లానింగ్‌ సిద్ధం చేసుకుంటున్నాడట రాజమౌళి.

 

మరోపక్క, రాజమౌళికి పూర్తిగా సహకరించే విషయమై చరణ్‌ కావొచ్చు, ఎన్టీఆర్‌ కావొచ్చు మరో ఆలోచన చేసే అవకాశమే లేదు. రాజమౌళి అంటే వారిద్దరికీ వున్న గౌరవం అలాంటిది. ఇదిలా వుంటే, ‘ఆర్ఆర్ఆర్‌’ షూటింగ్‌ పూర్తయ్యేదాకా ఇంకో సినిమా జోలికి వెళ్ళకూడదని చరణ్‌, ఎన్టీఆర్‌ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చరణ్‌కి కాస్త వెసులుబాటు వుంది. ఆ వెసులుబాటుతో చరణ్‌ త్వరలోనే ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం వుందట.

 

కాగా, ‘ఆర్ఆర్ఆర్‌’ గెటప్‌కి ఇ్బంది లేకుండా యంగ్‌ టైగర్‌ కూడా తన తదుపరి ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పాలనుకుంటున్నాడనీ తెలుస్తోంది. రాజమౌళి నుంచి ఇటు ఎన్టీఆర్‌కీ గ్రీన్‌ సిగ్నల్‌ దక్కిందని సమాచారం. అన్నీ కుదిరితే, ఆయా సినిమాల షూటింగులకి అటూ ఇటూగా ఇరువురూ 20 నుంచి 30 రోజుల సమయం కేటాయించే అవకాశముందట.

ALSO READ: బిగ్‌బాస్‌.. డబుల్‌ ఎలిమినేషన్‌ అంటున్నారేంటీ బాస్‌.!