ENGLISH

అఖిల్‌పై వస్తున్న ఆ రూమర్స్‌ సంగతేంటి చెప్మా!

15 March 2018-07:30 AM

అక్కినేని అఖిల్‌ హీరోగా తొలి సినిమాకే గ్రాండ్‌గా తెరంగేట్రం చేశాడు. అంత భారీ హంగామా హడావిడి చేసిన అఖిల్‌ తొలి చిత్రం 'అఖిల్‌' భారీగా నిరాశపరిచింది. హీరోగా ప్రధమ విఘ్నం ఎదుర్కొన్న అఖిల్‌కి ద్వితీయ విఘ్నం కూడా ఓ మోస్తరు స్థాయిలో తగిలిందనే చెప్పాలి. రీ లాంఛింగ్‌ మూవీగా తెరకెక్కిన 'హలో' మూవీ కూడా అఖిల్‌ని నిలబెట్టలేకపోయింది. 

దాంతో ముచ్చటగా మూడో ప్రయత్నానికి దిగుతున్నాడిప్పుడు మన అక్కినేని అందగాడు. ఈ మూడో ప్రయత్నానికి సక్సెస్‌ సమర శంఖాన్ని పూరించే ఆ డైరెక్టర్‌ ఎవరా? అంటే వరుణ్‌తో 'తొలిప్రేమ' సినిమాతో సక్సెస్‌ కొట్టిన యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి పేరు వినిపిస్తోంది. దాదాపుగా వెంకీ అట్లూరితో అఖిల్‌ సినిమా ఖరారైనట్లేనని తెలుస్తోంది. అయితే ఈ ఉగాదికి ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందనీ సమాచారమ్‌.

 

ఇదిలా ఉండగా, ఇంతవరకూ కెరీర్‌లో సక్సెస్‌ చవి చూడని అఖిల్‌కి ఆదిలోనే ఏదో అన్నట్లుగా, రూమర్స్‌ స్టార్ట్‌ అయిపోయాయి. అఖిల్‌ తన మూడో చిత్రానికి భారీగా రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడంటూ టాక్‌ వినిపిస్తోంది. అసలే అఖిల్‌తో సినిమా అంటే ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో అఖిల్‌ రెమ్యునరేషన్‌ ఆ స్థాయిలో డిమాండ్‌ చేయడమేంటా? అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అయితే నిజంగానే అఖిల్‌ భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడా? లేక ఇవన్నీ వట్టి పుకార్లేనా? అనేది ఈ విషయంలో అఖిల్‌ స్పందిస్తే కానీ తెలియదు. 

ఏది ఎలా ఉన్నా, ఈ కొత్త సంవత్సరంలో అఖిల్‌ మూడో సినిమా ఎలాగైనా పట్టాలెక్కే ఛాన్సెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: కర్తవ్యం తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్