ENGLISH

‘రిపబ్లిక్‌’.. రూలర్స్- బానిసలు

05 April 2021-14:00 PM

'వ్యవస్థ పునాదులు కరెప్ట్ అయినపుడు అందరూ కరప్టే.' ‘రిపబ్లిక్‌’ సినిమా కోసం దేవాకట్టా రాసుకున్న పంచ్ లైన్ ఇది. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా దేవ్‌కట్ట దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఈ రోజు టీజర్ ని రిలీజ్ చేశారు. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో, అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం’ అనే డైలాగ్ తో టీజర్ ఓపెన్ అయ్యింది.

 

టీజర్ చూస్తే ఇదో పొలిటికల్‌ థ్రిల్లర్ అనే సంగతి స్పష్టమైయింది. సాయిధరమ్‌ తేజ్‌ చాలా సెటిల్ గా కనిపించాడు. కూల్ బాడీ లాంగ్వేజ్ తో ఇంటెన్స్ లుక్ లో డైలాగులు చెప్పడం ఆకట్టుకుంది. ఇందులో రమ్యకృష్ణ పాత్ర కీలకంగా ఉండబోతుందని టీజర్ లో హింట్ ఇచ్చారు. రాజకీయ నాయకుల చెప్పులని క్లోజ్ లో చూపించి పక్కనే అధికారులని చూపించడం'' ప్రజలే కాదు సివిల్ సర్వెంట్స్ , కోర్టులు కూడా రూలర్స్ కింద బానిసలుగానే బ్రతుకుతున్నారనే డైలాగ్ సినిమా కాన్సెప్ట్ ని రివిల్ చేసింది. ఇక టీజర్ మొదట్లో ''ఈ కాలంలో మన జీవితాల నుండి రాజకీయాన్ని వేరు చేయలేం' అనే కొటేషన్ కూడా రిపబ్లిక్ థీమ్ ని తెలియజేసింది. మొత్తంగా ప్రస్థానం తర్వాత దేవాకట్టా నుండి వస్తున్న మరో పొలిటికల్ డ్రామా 'రిపబిక్ల్' అని టీజర్ చెప్పకనే చెబుతుంది. జూన్ నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ALSO READ: త్రివిక్ర‌మ్ అందుకే రాలేదా?