ENGLISH

మెగా డైరెక్టర్‌తో మెగా హీరో - షురూ అయ్యిందోచ్‌

23 September 2017-13:05 PM

మెగా డైరెక్టర్‌ వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా వస్తోన్న చిత్రం. మెగాస్టార్‌తో 'ఖైదీ నెం 150' తర్వాత వినాయక్‌ దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. భారీ అంచనాలున్నాయి దాంతో ఈ సినిమాపై. ఈ సినిమా షూటింగ్‌ తాజాగా ప్రారంభమైంది. మరో వైపు తేజు బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అదే 'జవాన్‌'. మెహరీన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల కానుంది 'జవాన్‌'. అప్పుడే కొత్త సినిమాని పట్టాలెక్కించేశాడు మెగా మేనల్లుడు. మనోడు తక్కువోడేం కాదు. వినాయక్‌తో సినిమా అంటే చిన్న విషయం కాదు. మాస్‌ పల్స్‌ బాగా తెలిసినవాడు వినాయక్‌. అలాంటి వినాయక్‌తో కలిసి పని చేయాలన్నది తన డ్రీమ్‌ అనీ, ఆ డ్రీమ్‌ ఇప్పుడు నిజమైందనీ తొలి రోజు షూటింగ్‌ విశేషాల్ని ఫోటో ద్వారా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఇప్పటికే మాస్‌ ఆడియన్స్‌లో తేజుకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇక వినాయక్‌ లాంటి డైరెక్టర్‌ చేతిలో పడితే, బాగా రాటు దేలతాడు. మాస్‌ మసాలా యాక్షన్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మామయ్యల సినిమాల్లోని సాంగ్స్‌ని రీ మిక్స్‌ చేయడంలో మనోడికి మంచి టేస్ట్‌ ఉంది. అందుకే ఈ సినిమా కోసం చిరంజీవి సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ఒకటి రెడీ చేసినట్లు సమాచారమ్‌.

ALSO READ: ఇండియన్ ఆస్కార్ ఎంట్రీ న్యూటన్ మూవీ రివ్యూ & రేటింగ్స్