ENGLISH

సాయి ప‌ల్ల‌వికి బాలీవుడ్ పిలుపు

17 June 2021-14:32 PM

తెలుగునాట తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది సాయి ప‌ల్ల‌వి. ఒక్కో సినిమాకీ దాదాపుగా 2 కోట్ల వ‌ర‌కూ పారితోషికం తీసుకొంటోంది. ద‌క్షిణాది నుంచి కూడా ఆమెకు మంచి ఆఫ‌ర్లు అందుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా... ఆమెకు పిలుపొచ్చింది. ఓ అగ్ర నిర్మాణ సంస్థ సాయి ప‌ల్ల‌వితో సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ట‌. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది.

 

త‌న పాత్ర‌కు ప్రాధాన్యం ఉంది కాబ‌ట్టే, ఈసినిమాలో న‌టించ‌డానికి సాయిప‌ల్ల‌వి ఓకే చెప్పేసింద‌ని తెలుస్తోంది. ఈ యేడాది చివ‌ర్లో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. తెలుగులో సాయి ప‌ల్ల‌వి మూడు సినిమాలు చేస్తోంది. ల‌వ్ స్టోరీ, విరాట‌ప‌ర్వం విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. `శ్యామ్ సింగ‌రాయ్‌`లోనూ త‌నే క‌థానాయిక‌. లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లొస్తే.. బాలీవుడ్ లోనూ వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి త‌న‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని సాయి ప‌ల్ల‌వి అంటోంద‌ట‌. ఇప్పుడు త‌ను కూడా... పాన్ ఇండియా స్టార్ అయిపోయిన‌ట్టే..?!

ALSO READ: Sai Pallavi Latest Photoshoot