ENGLISH

బంపర్ ఆఫర్ కొట్టిన భానుమతి!

29 September 2017-11:17 AM

ఫిదా చిత్రంతో అందరిని ఫిదా చేయడమే కాక తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకోగలిగింది. ఇదే సమయంలో తమిళంలోను ఇక తన భవిష్యత్తుకి డోకా లేకుండా ఉండేలాఓ బంపర్ ఆఫర్ ని సొంతం చేసుకుంది.

అదేంటంటే- తమిళ స్టార్ హీరో అయిన ధనుష్ సరసన ఒక చిత్రంలో నటించే అవకాశం ఈ ‘భానుమతి’ కొట్టేసింది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘మారీ’ చిత్రానికి రానున్నసీక్వెల్ చిత్రమైన ‘మారీ 2’ లో ఈ మే చోటు దక్కించుకుంది.

ఇదే విషయాన్ని ధనుష్ స్వయంగా ప్రకటించడంతో ఇక సాయి పల్లవికి తమిళ చిత్రసీమలో ఒక బ్లాక్ బస్టర్ చిత్రంలో అవకాశం లభించింది అని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

మొత్తానికి.. సాయి పల్లవి కి ధనుష్ రూపంలో బంపర్ ఆఫర్ తగిలిందనమాట..  

 

ALSO READ: సమంత, రకుల్‌.. మిథాలీ రాజ్‌గా ఎవరు?