బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని తన ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో సైఫ్ గాయ పడ్డాడు. ఈ క్రమంలో సైఫ్ కి ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ముంబై లీలావతి హాస్పటల్లో ట్రీట్ మెంట్ అందించారు వైద్యులు. వెంటనే పోలీసులు సైఫ్ ఇంటికి చేరి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు వేగవంతం చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు నిందితుడ్ని శుక్రవారం అరెస్ట్ చేశారు.
అరెస్టు చేసిన నిందితుడ్ని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం ఉదయం నుంచి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా గాలించటంతో నిందితుడి పట్టుబడ్డాడు. 24 అవర్స్ లో నిందితుడ్ని పట్టుకున్న పోలీసుల్ని పలువురు అభినంది స్తున్నారు. ప్రస్తుతం బాంద్రా పోలీసు స్టేషన్ లో విచారణ చేస్తున్న పోలీసులు మధ్యాహ్నం నిందుతుడ్ని కోర్టులో ప్రవేశ పెడతారు. నిందితుడి రిమైండ్ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. దొంగ తనం కోసం ఒక్కడే వచ్చాడా లేదా ఇంకెవరైనా ఉన్నారా? అన్నది పోలీసులకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు సూచించారు. సైఫ్ బాడీ లో చిక్కుకున్న గాజు ముక్కల్ని, విరిగిన చాకుని సర్జరీ చేసి తొలగించారు. నిందుతుడు ఫస్ట్ సైఫ్ చిన్నకొడుకు జేహ్ రూమ్ లోకి వెళ్లగా, కేర్ టేకర్ అడ్డుకుంది. ఈ క్రమంలో దొంగ ఆమెపై దాడి చేసాడు. ఈ గొడవ విని సైఫ్ బయటికి వచ్చి చూసి దొంగని అడ్డుకోగా కత్తితో దాడి చేసి ఆరుచోట్ల గాయపరిచాడు. కేర్ టేకర్ పై దాడి చేసేముందు కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపారు. కరీనాపై కూడా దాడి చేసే ప్రయత్నం చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సైఫ్ మెడ వెనుక, కుడి భుజం దగ్గర, వీపు ఎడమ వైపు, ఎడమ మణికట్టు, మోచేయిపై గాయాలయ్యాయి. దొంగ తనం చేసే ఉద్దేశ్యంతోనే అతను ఇంటిలోకి చొరబడినట్లు డిసిపి దీక్షిత్ గెడమ్ స్పష్టం చేసారు.
ALSO READ: వంద కోట్ల క్లబ్ లో వెంకీ