ENGLISH

స‌లార్ కి వంద కోట్ల డీల్.. అమేజాన్ సూప‌ర్ ఆఫ‌ర్‌

20 June 2021-16:15 PM

ఓటీటీలు వ‌చ్చాక‌.. నిర్మాత‌ల‌కు అద‌న‌పు ఆదాయ వ‌న‌రు దొరికిన‌ట్టైంది. శాటిలైట్ హ‌క్కుల్లానే, ఓటీటీ హ‌క్కుల రూపంలోనూ భారీ మొత్తాలు ద‌క్కుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల‌కైతే ఇక చెప్ప‌క్క‌ర్లెద్దు. సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే.. అడ్వాన్సులు ఇచ్చేసి లాక్ చేసుకుంటున్నాయి. తాజాగా ప్ర‌భాస్ సినిమా `స‌లార్‌` ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కూడా... అమ్ముడుపోయాయ‌ని టాక్‌. అమేజాన్ సంస్థ `స‌లార్‌` హ‌క్కుల కోసం వంద కోట్ల డీల్ తో వ‌చ్చింద‌ట‌. ప్ర‌స్తుతం అమేజాన్ తో `స‌లార్‌` నిర్మాత‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారని, ఓ వారం రోజుల్లో డీల్ ప‌క్కా అవ్వొచ్చ‌ని టాక్.

 

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం `స‌లార్‌`. 2022 వేస‌వికి విడుద‌ల కానుంది. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడి సినిమా కావ‌డం, అందులోనూ ప్రభాస్ హీరో అవ్వ‌డం వ‌ల్ల‌... ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఓవ‌ర్సీస్ హ‌క్కుల కోసం ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లైపోయాయ‌ని తెలుస్తోంది. ఈలోగా ఓటీటీ ఆఫ‌ర్ వ‌చ్చింది. రూ.100 కోట్ల‌కు ఓటీటీ ఆఫ‌ర్ అంటే... నిజంగా భారీ మొత్త‌మే. సో.. అమేజాన్ చేతికే ఈ సినిమా వెళ్లిపోవొచ్చు.

ALSO READ: 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్‌' రివ్యూ & రేటింగ్