ENGLISH

స‌ల్మాన్‌ని తెగ వాడేస్తున్న చిరు

05 April 2022-10:00 AM

చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌లో స‌ల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఓ తెలుగు సినిమాలో స‌ల్మాన్ న‌టించ‌డం ఇదే తొలిసారి. కాబ‌ట్టి.. క‌చ్చితంగా గాడ్ ఫాద‌ర్‌కి అది అన‌ద‌పు ఆక‌ర్ష‌ణ అవుతుంది. అంతేకాదు.. ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేసిన‌ప్పుడు.. స్పెష‌ల్ మైలేజీ కూడా వస్తుంది. మ‌ల‌యాళంలో లూసీఫ‌ర్ చిత్రానికి రీమేక్ ఇది. ఫృథ్వీరాజ్ వేసిన వేష‌మే.. ఇప్పుడు.. స‌ల్మాన్ తో వేయిస్తున్నారు. క్లైమాక్స్ ఫైట్‌లో.. ఫృథ్వీ ఎంట్రీ ఇవ్వ‌డం.. మంచి కిక్ ఇస్తుంది. కొన్ని సీన్లు.. ఫైట్ కే ఆ పాత్ర ప‌రిమితం.స‌ల్మాన్ వ‌చ్చాడు కాబ‌ట్టి... ఇప్పుడు త‌న‌కో పాట కూడా యాడ్ చేశార‌ని స‌మాచారం. ఆ పాట‌లో చిరంజీవి కూడా క‌నిపిస్తాడ‌ట‌.

 

చిరు, స‌ల్మాన్ క‌లిసి స్టెప్పేస్తే ఇక చెప్పేదేముంది? థియేట‌ర్లు మోత మోగిపోవ‌డం ఖాయం. ఈ సినిమాకి గానూ.. నాకు ఎలాంటి పారితోషికం వ‌ద్దు... అని స‌ల్మాన్ ఖాన్ తెగేసి చెప్పాడ‌ట‌. నిజానికి స‌ల్మాన్ ఎంట్రీకి ఇంకో నిర్మాత ఎవ‌రైనా అయితే క‌నీసం పాతిక కోట్ల‌యినా ఇవ్వాల్సిందే. అదంతా ఇప్పుడు `గాడ్ ఫాద‌ర్‌`కి మిగిలిపోయిన‌ట్టే. కొన్ని సీన్లు, ఫైట్‌లో క‌నిపించ‌డానికి ఓకే అన్న‌.. స‌ల్మాన్‌తో పాట‌లోకి కూడా లాక్కొచ్చి వాడేస్తున్నారు. చిరుది మెగా బుర్రే.!

ALSO READ: ఈసారైనా హిట్టు కొడ‌తాడా..?