ENGLISH

బాలీవుడ్‌కి ప్రబాస్‌ అప్పుడే కాదు

15 June 2017-15:50 PM

సల్మాన్‌ ఖాన్‌, ప్రబాస్‌ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారంటూ గాసిప్స్‌ ఈ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాతో ప్రబాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమంటూ రూమర్స్‌ వస్తున్నాయి. ఈ రూమర్స్‌కి అటు సల్మాన్‌ అభిమానులు, ఇటు ప్రబాస్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ న్యూస్‌లో నిజం లేదనీ, ఇదంతా ఉత్తిదేననీ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి తేల్చేశారు. ప్రస్తుతం అలాంటి ఆలోచన తనకు లేదని రోహిత్‌ శెట్టి అన్నారు. 'బాహుబలి' సినిమాతో ప్రబాస్‌ యూనివర్సల్‌ హీరో అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రబాస్‌ మార్కెట్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఈ మాట బలం చేకూరింది. కానీ ఇది జరగాలంటే ఇంకా టైం పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రబాస్‌ 'సాహో' సినిమాతో బిజీగా ఉన్నాడు. సుజిత్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ రేంజ్‌ టెక్నికల్‌ ఎఫెక్ట్‌ని ఈ సినిమాలో చూపించనున్నారట. దాంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే 'సాహో' టీజర్‌ సందడి చేస్తోంది. మరో పక్క సల్మాన్‌ 'ట్యూబ్‌ లైట్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏడాదికో సినిమా చేసినా, చాలా సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ ఉంటాడు సల్మాన్‌. గతేడాది 'సుల్తాన్‌'తో వచ్చి రికార్డు స్థాయిలో హిట్‌ కొట్టి వెళ్లాడు. ఇప్పుడు 'ట్యూబ్‌లైట్‌'తో రాబోతున్నాడు. రంజాన్‌కి ఈ సినిమా విడుదల కానుంది. 

 

ALSO READ: రానా కాజల్ కలిసి ఫినిష్ చేసేశారు