ENGLISH

రేస్ 3 కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

17 June 2018-18:55 PM

సల్మాన్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఒక రెండు సార్లు సినిమా చూస్తే చాలు ఆయన ప్రతి సినిమా లాభాల పంట పండిస్తుంది అని అంటుంటారు. ఇది నిజం అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే సల్మాన్ భాయి ఫాలోయింగ్ అటువంటిది మరి.

ఇక తాజాగా రంజాన్ సందర్భంగా ఆయన చిత్రం రేస్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలకి ముందే దాదాపు రూ  130 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసి ఒక రికార్డు సృష్టించింది. సల్మాన్ కి ఉన్న ఫాలోయింగ్ కి ఇది కూడా ఒక ఉదాహరణ కింద చెప్పొచ్చు.
ఇక రేస్ 3 విషయానికి వస్తే, సినిమా అస్సలు బాలేదని, కథ లో కాని కథనంలో కాని అసలు బలమే లేదని అందరూ విమర్శిస్తున్నారు.

 

అయితే భాయి ఫ్యాన్స్ మాత్రం సినిమా టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లకి వెళుతున్నారు. దీని పర్యవసానమే ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ అని చెప్పొచ్చు. తొలిరోజు ఈ చిత్రానికి రూ 29 కోట్లు రాగా, రెండవ రోజు రూ 38 కోట్లు వచ్చాయి. అయితే మూడవ రోజు ఆదివారం కావడంతో కచ్చితంగా ఈ రోజు వచ్చే వసూళ్ళతో రేస్ 3 రూ 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

ఏదేమైనా.. సినిమా బాగుంటే ఈ కలెక్షన్స్ రేంజ్ ఇంకా భారీ స్థాయిలో ఉండేవి అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 

ALSO READ: సెక్స్ రాకెట్ కేసులో మెహ్రీన్ ని విచారించిన పోలీసులు..!