ENGLISH

బికినీలో సమంత - నిజమా? కాదా?

03 June 2017-18:34 PM

అక్కినేని వారి కోడలు, నాగచైతన్యకు కాబోయే భార్య అయిన సమంత బికినీలో కనిపించనుందన్న గాసిప్స్‌ జోరుగా షికార్లు చేస్తోంది. అయితే బికినీలో సమంత కన్పించే సీన్‌ లేదని ఆమె నటిస్తున్న సినిమాల లిస్ట్‌ని పరిశీలిస్తే అవగతమవుతుంది. ఇంతవరకూ శామ్‌ గ్లామర్‌గా కనిపించింది కానీ, మరీ డోస్‌ పెంచి అందాల దాడి చేయలేదు. తాజాగా వస్తోన్న ఈ రూమర్‌తో ఆమె అభిమానులు కొంచెం హర్ట్‌ అవుతున్నారట. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో సమంత ఓ సినిమాలో నటిస్తోంది. అసలు ఇందులో మోడ్రన్‌ లుక్‌కి ఛాన్స్‌ లేని పాత్రలో సమంత కనిపించనుందని సమాచారమ్‌. ఎందుకంటే ఇది పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతది అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్ర. అయితే ఇది కాకుండా ఇంకేమన్నా కొత్త సినిమాలో సమంత బికినీ గ్లామర్‌ చూపించనుందా? అనే అనుమానమైతే ఉంది. సమం తెలుగులో చరణ్‌తో సినిమా కాక, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. ఒకవేళ ఆ సినిమాల్లో ఏమైనా సమంత బికినీ షో ఉండబోతోందా? అనే టాక్‌ వినిపిస్తోంది. అదీ కాక ఈ మధ్యనే సోషల్‌ మీడియాలో సమంత బికినీ ఫొటోలు (బికినీలో ఆమె లేదు) షేర్‌ చేసింది. అయితే వెకేషన్‌కి గుర్తుగా ఆ ఫొటోల్ని షేర్‌ చేసిన సమంత, ఆ తర్వాత వెకేషన్‌ని 'పూల్‌'లో ఎంజాయ్‌ చేస్తూ, బికినీల్లోనే సందడి చేసింది. అది రియల్‌ లైఫ్‌. మరి రీల్‌ లైఫ్‌లో బికినీ గ్లామర్‌ సమంత చూపిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

 

ALSO READ: సన్నీలియోన్‌ షార్ట్‌ ఫిలిం కేరాఫ్‌ వర్మ