సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవుతోంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని పలకరించిన సామ్ ఇప్పుడు సీటా డెల్ ఇండియన్ వెర్షన్ హానీ బనీతో మరొకసారి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయటానికి రెడీగా ఉంది. వరుణ్ ధావన్, సమంత ముఖ్య పాత్రల్లో నటించిన హానీ బనీ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెక్స్ట్ కూడా సామ్ రెండు వెబ్ సిరీస్ లకి సైన్ చేసింది. ప్రస్తుతం హానీ బనీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సామ్, మధ్య మధ్యలో సోషల్ మీడియాలో ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తోంది.
తాజాగా ఇలాంటి చిట్ చాట్ ప్రోగ్రాం ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించింది. 'క్యూ అండ్ ఎ' సెషన్‌లో ఫాన్స్ అడిగినవాటికి సామ్ రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక అభిమాని సామ్ ని మళ్ళీ వెయిట్ పెరగమని అడిగాడు. అతని ప్రశ్నకి సామ్ మండిపడింది. కారణం మళ్ళీ మళ్ళీ సామ్ కి అదే ప్రశ్న ఎదురవుతోంది. ఈ మధ్య తరచుగా ఇలాంటివే అడుగుతున్నారు. దాంతో అసహనానికి లోనైన సామ్ మళ్ళీ బరువు గురించే ప్రశ్న. నా వెయిట్ గురించి నాకు తెలుసు. మీకెందుకు అంత దిగులు. ప్రజంట్ నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నాను. దాని వాళ్ళ నా వెయిట్ ఇలా ఉంది. ప్రస్తుతం ఉన్న నా ఆరోగ్య పరిస్థితులకి నేను ఇలాగే ఉండటం కరక్ట్, ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి. ఎవరికి నచ్చినట్లు వారిని బతకనివ్వండి అంటూ అతని పై ఫైర్ అయ్యింది సమంత.
మయాసైటీస్ కారణంగా సమంత రక రకాల ట్రీట్ మెంట్ లు డైట్స్ ఫాలో అవుతూ ఉంది. ఇప్పటికి కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే ఉంది. దానికారణంగా చాలా వెయిట్ లాస్ అయ్యింది. గతంలో సామ్ సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోస్ చూసి ఫాన్స్ కంగారు పడ్డారు. సామ్ మరీ ఇంత బక్కగా తయారయ్యింది అని. అప్పటి నుంచి ప్రతి సారి ఇదే ప్రశ్న ఎదురవుతూ ఉంది. సహనం కోల్పోయిన సామ్ చివిరికి ఇలా రిప్లై ఇచ్చింది. కొందరు నెటిజన్స్ సామ్ ని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు. ఆమె కున్న హెల్త్ ప్రోబ్లమ్స్ అర్థం చేసుకోకుండా పదే పదే విసిగించటం ఎందుకని చివాట్లు పెడుతున్నారు.
ALSO READ: సేఫ్ జోన్ లో తండేల్