ENGLISH

మ‌హేష్‌తో స‌మంత‌?

31 January 2022-14:30 PM

మ‌హేష్ బాబు - స‌మంత‌.... సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. ఇద్ద‌రి క‌ల‌యిక‌లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, దూకుడు లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలొచ్చాయి. ఇద్ద‌రూ క‌ల‌సి న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం అట్ట‌ర్ ఫ్లాప్ అయినా.. వీళ్ల‌ది సూప‌ర్ హిట్ జోడీనే. అయితే వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌సి న‌టించ‌బోతున్నార‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

 

మ‌హేష్ బాబు- త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా పూజా హెగ్డేని ఎంచుకున్నారు. అయితే ఆమె స్థానంలో ఇప్పుడు స‌మంత వ‌చ్చి చేరిన‌ట్టు తెలుస్తోంది. పూజా కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోవ‌డంతో ఈ మార్పు చేయాల్సివ‌చ్చింద‌ని స‌మాచారం. త్రివిక్ర‌మ్ - స‌మంత‌ల‌ది కూడా విజ‌య‌వంత‌మైన కాంబోనే. అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ కృష్ణ‌మూర్తి, అ.ఆ... ఇలా ఇద్ద‌రి నుంచీ హ్యాట్రిక్ చిత్రాలొచ్చాయి. ఈ సినిమా ఒప్పుకుంటే డ‌బుల్ హ్యాట్రిక్ కి దారి ఇచ్చిన‌ట్టు అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 3న ఈ చిత్రం లాంఛ‌నంగా మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. ఇదో ఫ్యామిలీ డ్రామా అని, 2023 సంక్రాంతికి విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

ALSO READ: పుష్పకీ భీమ్లాకీ లింకు పెట్టిన వ‌ర్మ‌... కాఫీ టైమ్ ట్వీట్ల‌తో హోరు