ENGLISH

పుష్ప 2 లో సామ్ గెస్ట్ రోల్?

19 October 2024-12:15 PM

మయాసైటీస్ కారణంగా వన్ ఇయర్ సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి, జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. త్వరలో 'హానీ బనీ' సిరీస్ తో ఆడియన్స్ ని అలరించనుంది. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం అవుతోందని సమాచారం. ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఓపికగా, ఉత్సహాంగా ఎదురుచూస్తున్న మూవీ 'పుష్ప 2'. ఈ మూవీలో సామ్ ఒక సర్ప్రయిజింగ్ రోల్ లో కనిపిస్తున్నట్టు టాక్. మొదటి పార్ట్ లో ఊ అంటావా..మావా ... ఊ ఊ అంటావా అనే ఐటెం సాంగ్ చేసి, మంచి క్రేజ్ తెచ్చుకుంది సామ్. అసలు సామ్ కెరియర్ లో మొదటిసారిగా ఇలా ఐటెం గీతానికి నర్తించింది. ఎంత పేరు , గుర్తింపు వచ్చిందో అన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. 


పుష్ప 2 లో కూడా ఒక ఐటెం సాంగ్ ఉందని , దాని కోసం సామ్ ని సంప్రదించగా నో చెప్పింది. ఎన్ని సార్లు మేకర్స్ అప్రోచ్ అయినా సామ్ అంగీకరించలేదు. దీనితో ఇప్పటివరకు ఈ పాట పూర్తి చేయలేదు. పెండింగ్ లోనే ఉండి పోయింది. ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్, త్రిప్తిదిమ్రి పేర్లు వినిపించాయి. కానీ ఇంతలోనే పుష్ప 2లో మళ్లీ సమంత ఒక స్పెషల్ సాంగ్ చేస్తోందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పుష్ప 2 లో రెండు ప్రత్యేక గీతాలున్నాయని అందులో ఒకటి చాలా స్పెషల్ అని వినిపించింది. ఇప్పుడు ఈ పాట కోసమే సామ్ ని మళ్ళీ మేకర్స్ అప్రోచ్ అయినట్లు సమాచారం.       


ఊ అంటావా పాటని మించి ఈ పాట ఉండనుందని టాక్. అంతే కాదు స్పెషల్ సాంగ్ తో పాటు, గెస్ట్ రోల్ లో కూడా సామ్ కనిపిస్తుందని తెలుస్తోంది. పుష్ప 2లో సామ్ నటిస్తే ఇంకొంచెం క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట. పుష్ప3 లో సామ్ పాత్రకి  కొనసాగింపు కూడా ఉండేటట్లు పాన్ చేస్తున్నారట సుక్కు.  ఈ న్యూస్ విన్న సామ్ ఫాన్స్ మళ్ళీ తన హవా సాగిస్తుందని, టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ తో రీ ఎంట్రీ  ఇస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.