ENGLISH

సమంతా-చైతుల హనీమూన్ ఎక్కడో తెలుసా?

06 October 2017-18:47 PM

నాగ చైతన్య-సమంతాల వివాహం ఇంకోద్దిగంటల్లో జరగనుంది. ఇక ఈ వేడుకకి అక్కినేని, రామానాయుడు కుటుంబసభ్యులతో పాటుగా మరికొంతమంది సన్నిహితులు ఈ వేడుకకి హాజరుకానున్నారు.

ఇదిలావుండగా ఈ కొత్త జంట హనీమూన్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకుందట. ఆ ప్రదేశం మరేదో కాదు వారిరువురు నటించిన ఏ మాయ చేసావే చిత్రంలో సెకండ్ హాఫ్ లో మనకు కనపడే ఫారన్ లోకేషన్స్ లోనే వీరు హనీమూన్ కి వెళ్ళనున్నట్టు సమాచారం.

 

అంతేకాకుండా సమంతా తమ నిశ్చితార్దానికి కూడా ఆ చిత్రంలోని సన్నివేశాలనే తన చీర పైన నేయించిన సంగతి విదితమే. ఏదైతేనేమి సమంతా-చైతులు.. తాము నటించిన ఏ మాయ చేసావే చిత్రంలోలా నిజజీవితంలో కూడా ప్రేమించి పెళ్ళీచేసుకోవడం విశేషం.  

 

ALSO READ: Qlik Here For The #ChaiSam Wedding Gallery