ENGLISH

స‌మంతకి షాకిచ్చిన ఫ్యాన్.

02 June 2020-10:30 AM

సాధార‌ణంగా సినిమా వాళ్లు ఫ్యాన్స్‌కి షాకిస్తుంటారు. కానీ సోష‌ల్ మీడియా అందుబాటులోకివ‌చ్చాక అభిమానులే తార‌క‌ల‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా ఓ ఫ్యాన్ స‌మంత‌ని ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా చేశాడు. స‌మంత డిగ్రీ స‌ర్టిఫికెట్‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి, స‌మంత కు ట్యాగ్ చేశాడు. అది చూసి స‌మంత షాకైంది. `ఈ స‌ర్టిఫికెట్ మీరెలా సంపాదించారు` అంటూ అభిమానిని ప్ర‌శ్నించింది.

 

అయితే ఆ వెంట‌నే ఆ ట్వీట్‌ని డిలీట్ చేసేశాడు ఆ అభిమాని. ఈలోగానే ఆ డిగ్రీ స‌ర్టిఫికెట్ తెగ వైర‌ల్ అయిపోయింది. స‌మంత డిగ్రీ మార్కులిస్టు చూస్తే అంతా ఆశ్చ‌ర్య‌పోతారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ మ‌ద్రాస్ నుంచి స‌మంత కామ‌ర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. డిన్టెన్ష‌న్‌లో పాసైంది. సెకండ్ లాంగ్వేజ్‌గా ఫ్రెంచ్‌ని ఎంచుకుంది. సో.. స‌మంత‌కు ఫ్రెంచ్ కూడా బాగానే వచ్చ‌న్న‌మాట‌. స‌మంత మార్కులిస్టు చూస్తే.. ఉత్త‌మ విద్యార్థిని స‌ర్టిఫికెట్ ఇచ్చేయాల‌నిపిస్తోంది.

ALSO READ: Samantha Latest Photoshoot