ENGLISH

సమంత.. సంచలనం ఆ రేంజ్‌లో వుంది మరి.!

01 January 2021-11:03 AM

పూజా హెగ్దే సూపర్‌ హిట్‌ కొట్టింది.. రష్మిక అయితే రెండు హిట్లు కొట్టేసింది. కానీ, 2020 సంవత్సరానికి సంబంధించి నిత్యం వార్తల్లో వుంటోన్న హీరోయిన్‌ ఎవరు.? అంటే మాత్రం, ఖచ్చితంగా సమంత అక్కినేని పేరే చెప్పాలి. సినిమాల సంగతి పక్కన పెడితే, సేవా కార్యక్రమాలతోనూ, ఫిట్‌నెస్‌ పాఠాలతోనూ సమంత టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారింది. ఆ మాటకొస్తే, కోలీవుడ్‌లోనూ సమంత సందడి తక్కువేమీ కాదు ఈ ఏడాది.

 

కరోనా నేపథ్యంలో కూడా సమంత హవా కొనసాగింది. మాల్దీవులకు వెళ్ళి హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులివ్వడం, కరోనా వేళ ఇంట్లోనే కూరగాయలు పండించే ప్రక్రియ గురించి చెప్పడం.. ఇలా చెప్పుకుంటూ పోతే సమంత చాలానే చేసింది. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ ఫోర్‌ కోసం ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌లోనూ సమంత సందడి చేసింది. 'నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా వుండదు..' అంటూ సమంత ఆ ఎపిసోడ్‌లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ కాక, 'సామ్‌ జామ్‌' అంటూ సమంత, ఓటీటీ వేదికపై హల్‌చల్‌ చేసేస్తోంది.

 

ఎలా చూసినా, సమంత ఈ ఏడాది ఓ రేంజ్‌లో తన ప్రత్యేకతను చాటుకుందనే చెప్పాలి. ఈ సంవత్సరం ఇలా సాగింది.. వచ్చే సంవత్సరం వెండితెరపై దుమ్ము రేపేస్తా.. అంటూ సరికొత్త సినిమాలతో సిద్ధమయిపోతోంది సమంత. ఔను, సమంత ఏం చేసినా స్పెషల్‌. 'సమంత ప్రెగ్నెంట్‌ అట కదా..' అంటూ ఈ ఏడాది చాలాసార్లు గాసిప్స్‌ వస్తే, 'ఔనా, నాకు తెలియకుండానా.?' అని ఆమె సెటైర్లేసిన వైనం చాలామందికి పెద్ద షాకే ఇచ్చింది.

ALSO READ: Samantha Latest Photoshoot