ENGLISH

ఫ్యాషన్‌ మీరేంటో చెబుతుంది: సమంత

15 June 2017-17:59 PM

క్యూట్‌ భామ సమంత ఫ్యాషన్‌ గురించి క్యూట్‌ క్యూట్‌గా చెప్పేస్తే ఎలా ఉంటుంది ఇదిగో ఇలాగే ఉంటుంది. ఫ్యాషన్‌ అంటే ఆషామాషీ విషయం కాదని సమంత పేర్కొంది. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవడం ద్వారా ఎవరైనా కొత్తగా కనిపించడమే కాకుండా, ఆ ట్రెండ్స్‌ ద్వారా వారు తమ అభిరుచుల్ని ప్రపంచానికి తెలియజేసినవారవుతారని సమంత అంటోంది. కంఫర్ట్‌గా ఉండటంతోపాటుగా అందరిలోకీ ప్రత్యేకంగా కన్పించాలనుకోవడమే ఫ్యాషన్‌ అని చెబుతూ తనవరకూ తాను సెలబ్రిటీని గనుక ఎక్కువగా ట్రెండ్స్‌తో పోటీ పడవలసి ఉంటుందని, వ్యక్తిగతంగానూ తాను ఎక్కువగా ట్రెండ్స్‌ని ఫాలో అవడాన్ని ఇష్టపడతానని సమంత వెల్లడించింది. అవును నిజమే ఫ్యాషన్‌ ఐకాన్‌గా సమంత ఎప్పటికప్పుడే సరి కొత్త ఫ్యాషన్స్‌ని పరిచయం చేస్తూ ఉంటుంది. అందుకే ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ వరకూ సమంత ఇప్పుడున్న హీరోయిన్లందరిలోకీ వెరీ వెరీ స్పెషల్‌. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత త్వరలో అక్కినేని నాగచైతన్యని పెళ్ళాడనుంది. రామ్‌ చరణ్‌తో ఓ సినిమాలో నటిస్తోంది సమంత. సుకుమార్‌ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా కొత్తగా కనిపించనుంది. 'రంగస్థలం' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బిజీ బిజీగా జరుగుతున్నాయి. 

ALSO READ: రానా కాజల్ కలిసి ఫినిష్ చేసేశారు