ENGLISH

సుకుమార్‌, మారుతిని ఫాలో అవుతున్న సంపత్‌నంది

20 June 2018-14:36 PM

మాస్‌ డైరెక్టర్‌గా సంపత్‌నందికి పాపులారిటీ ఉంది. మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ని తెరకెక్కించడంలో దిట్ట సంపత్‌ నంది. అయితే ఈ మధ్య డైరెక్టర్‌గా సంపత్‌నందికి అంతగా కలిసి రావడం లేదు. దాంతో ట్రాక్‌ ఛేంజ్‌ చేశాడు. డైరెక్టర్‌ నుండి ప్రొడ్యూసర్‌గా గేర్‌ మార్చాడు. సంపత్‌నంది ప్రొడక్షన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం 'పేపర్‌బోయ్‌'. వి.జయ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

కాగా ఈ సినిమాకి ప్రొడక్షన్‌తో పాటు, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ కూడా సంపత్‌నంది అందిస్తుండడం విశేషం. గతంలో సుకుమార్‌, మారుతి తదితర డైర్టెర్లు చిన్న సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవడంతో పాటు, వాటికి కథలను అందించిన సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పుడు సంపత్‌ నంది కూడా చేరిపోయాడు. 'పేపర్‌బోయ్‌' అనే క్యాచీ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంతోష్‌ శోభన్‌, ప్రియాశ్రీ, తన్యా హోప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేరళలో ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువగా నిర్వహించారు. కేరళలోని ఆహ్లాదమైన లొకేషన్స్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ అట్రాక్షన్‌ కానున్నాయట. 

ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు, ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ బిజీగా ఉంది. ఏదో చిన్న సినిమా అన్నట్లుగా కాకుండా, ఈ సినిమాపై సంపత్‌నంది ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడట. జూలైలో 'పేపర్‌బోయ్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 

ALSO READ: పవన్ కళ్యాణ్ కి ఝలక్ ఇచ్చిన బండ్ల గణేష్