ENGLISH

సంపూ చెప్పిన సంచలన నిజాలు

22 April 2017-17:47 PM

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ఫిలిం ఎంట్రీనే ఒక సంచలనం అని చెప్పాలి అలాంటిది అతనికి ఎవ్వరికీ తెలియని బ్యాక్ గ్రౌండ్ ఉంటే అది ఇంకా పెద్ద సంచలనమనే చెప్పాలి.

వివరాల్లోకి వెళితే, సంపూర్నేష్ ఒక ప్రముఖ యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సంబంధించి ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని నిజాలు బయటపెట్టాడు. తన అసలు పేరు నరసింహా చారి అని తన స్వంత ఊరు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా, మిట్టపల్లి గ్రామం అని తెలిపాడు.

సినిమాల్లోకి రావడానికి ముందు తన తండ్రి నుండి సంక్రమించిన కంసాలి వృత్తిని చేస్తుండేవాడట. ఇక తనకి ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పాడు. సినిమాల్లో నిలదోక్కుకోవదానికే తాను యుఎస్ఏ నుండి వచ్చిన NRI అని అబద్దం చెప్పానని తెలిపాడు.

అయితే తనకి సినిమాల్లో మార్గదర్శనం చేసి ఇప్పుడు తను ఉన్న స్థితికి కారణం- హృదయ కాలేయం దర్శకుడు సాయి రాజేష్ (స్టీఫెన్ శంకర్) అని తన మనసులోని మాట పంచుకున్నాడు.   

ఇన్ని సంచలనాలు తెలిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ వీడియో గా సర్క్యులేట్ అవుతుంది.

 

ALSO READ: ప్రభాస్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు