ENGLISH

అసెంబ్లీ ముందు న‌గ్నంగా.. సంపూర్ణేష్ బాబు

03 July 2021-15:00 PM

హృద‌య‌కాలేయంతో.... గ‌మ్మ‌త్తైన కామెడీ చేశాడు సంపూర్ణేష్ బాబు. అస‌లు వీడు హీరో ఏంట్రా బాబూ... అనుకున్నా - త‌నివి తీరా న‌వ్వుకున్నారు. ఆ సినిమాతో సంపూకి వ‌చ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. సింగం 123, కొబ్బ‌రి మ‌ట్ట సినిమాల్లో సంపూ హీరోగా మెరిశాడు. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లో కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు `క్యాలీఫ్ల‌వ‌ర్‌` సినిమా చేస్తున్నాడు. శీలో ర‌క్షిత ర‌క్షితః అనేది క్యాప్ష‌న్‌. టైటిల్ మాత్ర‌మే కాదు.

 

ఇందులో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కూడా గ‌మ్మ‌త్తుగా ఉండ‌బోతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ రోజు ఓ లుక్ విడుద‌ల చేశారు. అందులో సంపూ న‌గ్నంగా క‌నిపించాడు. అయితే మ‌ధ్య‌లో క్యాలిఫ్ల‌వ‌రే అడ్డు. అసెంబ్లీ ముందు సంపూ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌, క‌వ‌ర్ చేస్తున్న మీడియా ప్ర‌తినిథుల హంగామా.. కామెడీగా ఉంది. ఇలాంటి కామెడీనే సిల్వ‌ర్ స్క్రీన్ పైనా క‌నిపిస్తే.. పైసా వ‌సూల్ అయిపోయిన‌ట్టే. ఆర్కే మ‌లినేని ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

ALSO READ: క‌ల్యాణ్‌రామ్‌.... గూఢ‌చారి 1960