ENGLISH

బిగ్ బాస్ హోస్ట్ నాని పై సంజన సంచలన వ్యాఖ్యలు..!

19 June 2018-14:50 PM

నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్‌బాస్‌ 2' వివాదాల్లోకెక్కింది. ఇదో రియాల్టీ గేమ్‌ షో. ఈ షో నుండి తొలుత ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ సంజన బయటికి వచ్చి, వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 

తన పట్ల గేమ్‌ నిర్వాహకులు, గేమ్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని వివక్ష చూపించారనీ, కావాలనే తనను ఈ షో నుండి తప్పించారనీ, నందినీ రాయ్‌ అనే మరో కంటెస్టెంట్‌ని హౌస్‌ లోపలికి పంపించేందుకే తనని ఎలిమినేట్‌ చేశారనీ, 'బిగ్‌బాస్‌' టీమ్‌పై ఆరోపణలు చేస్తోంది సంజన. హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌పై కూడా సంజన విరుచుకుపడుతోంది. ఎన్టీఆర్‌ అంటే తనకెంతో ఇష్టమనీ, బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఎన్టీఆర్‌ ప్లేస్‌ని రీప్లేస్‌ చేయడం ఎవ్వరి వల్లా కాదనీ, నాని ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్డ్‌ అనీ సంజన అంటోంది. 

తనకు నాని నచ్చలేదనీ చెబుతోంది సంజన. అంతేకాదు, ఎన్టీఆర్‌ని ఐఫోన్‌తోనూ, నానిని ఆర్డినరీ ఫోన్‌తోనూ కంపేర్‌ చేసిందనీ సంజనను నెటిజన్లు గుమ్మెత్తి పోస్తున్నారు. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు సంజన అంటే తెలిసిన వాళ్లు ఎంతమంది ఉన్నా, బయటికి వచ్చాక సంజన చేస్తున్న పబ్లిసిటీ స్టంట్‌ అంతా ఇంతా కాదు, మీడియాలో ఆమె తన 'ఆవేదన' పేరుతో, ఆడియన్స్‌లో క్రియేట్‌ చేస్తున్న ఇంట్రెస్ట్‌కి బాగానే ఫాలోయింగ్‌ సంపాదించుకుంటోంది.

హౌస్‌లోని తన తోటి కంటెస్టెంట్స్‌లో ఎవరెవరు ఎలా బిహేవ్‌ చేశారో, తనను బ్లేమ్‌ చేసేందుకు ఎలా ట్రై చేశారో మీడియా ముఖంగా ఆడియన్స్‌తో పంచుకుంటోంది సంజన. 100 రోజుల పాటు సాగబోయే 'బిగ్‌బాస్‌' 16 మంది కంటెస్టెంట్స్‌లో బయటికి వచ్చిన సంజన ప్లేస్‌లో నందినీ అనే కొత్త కంటెస్టెంట్‌ ఎంట్రీ ఇవ్వనుంది.

ALSO READ: అనసూయని విచారించిన ఇంటర్ పోల్?!