ENGLISH

సంజూ.. ఎంట్రీ ఇచ్చాడండోయ్‌!

16 October 2020-15:00 PM

కాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న సంజ‌య్‌ద‌త్‌... మెల్ల‌మెల్ల‌గా కోలుకుంటున్నారు. ఇప్పుడు సెట్లోనూ అడుగుపెడుతున్నాడు. `కేజీఎఫ్ - చాప్ట‌ర్ 2`లో సంజ‌య్ ద‌త్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. సంజూపై ఇది వ‌ర‌కే కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. మ‌రో షెడ్యూల్ ప్లాన్ చేస్తుండ‌గా సంజూ ఆరోగ్యం పాడైంది. చికిత్స కోసం దుబాయ్ కూడా వెళ్లారు. అక్క‌డి నుంచి ఇటీవ‌లే సంజూ తిరిగొచ్చారు. ఇప్పుడు సెట్‌లోకీ అడుగుపెట్టారు.

 

కేజీఎఫ్ 2 కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభ‌మైంది. సంజూ సెట్లోనూ అడుగుపెట్టారు. ఈనెలాఖ‌రునాటికి సంజ‌య్ ద‌త్ పై స‌న్నివేశాలన్నీ పూర్తి చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. ఈపాటికి షూటింగ్ కూడా పూర్త‌య్యేదే. సంజయ్ ద‌త్ అనారోగ్యం వ‌ల్ల ఆల‌స్య‌మైంది. సంజూ.. తిరిగి సెట్లో అడ‌గుపెట్ట‌డం ప‌ట్ల చిత్ర‌బృందం సంతోషం వ్య‌క్తం చేసింది.

ALSO READ: త్రిష - శింబు పెళ్లి.. త‌మిళ నాట ర‌చ్చ‌ర‌చ్చ‌!