ENGLISH

స్టార్ కమిడియన్ సంతానం హీరోగా సర్వర్ సుందరం ఫిబ్రవరి 14న విడుదల !!

01 February 2020-15:04 PM

స్టార్ కమెడియన్ సంతానం హీరో గా తెరకెక్కిన సర్వర్ సుందరం తమిళ, తెలుగు భాషల్లో ఈ ప్రేమికులు రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకి సిద్ధం అయ్యింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కమిడియన్ సంతానం ఈ కమర్షియల్ కామెడీ ఎంటెర్టైనెర్ లో హీరో గా ఆడియన్స్ ని ఫుల్ గా అలరించబోతున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడిగా నటించింది.

 

ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించడం జరిగింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండడం విశేషం. బల్కి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ నిర్మాతలు. ఫిబ్రవరి 14న తెలుగులో భారీ రేంజ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని నిర్మాతలు తెలిపారు.

ALSO READ: వర్మగారి డైరీలో మరో యదార్ధ గాధ.!