ENGLISH

నాని దసరాని రీచ్ అవుతాడా?

30 August 2024-15:29 PM

న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న తరవాత లేటెస్ట్ గా సరిపోదా శనివారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రీమియర్ షో నుంచి పాజిటీవ్ టాక్ తో ఆకట్టుకుంది. కథ రొటీన్ అయినా హీరో కేవలం వారానికి ఒక్కరోజే కోపం ప్రదర్శించటం అన్న కాన్సెప్ట్ తో ఆకట్టుకున్నారు. నాని, SJ సూర్య పోటీపడి మరీ నటించి సినిమా విజయానికి కీలకమయ్యారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ గా నటించింది. 


'సరిపోదా శనివారం' మూవీ ఆగస్టు 29 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు వసూళ్లు తెలుగులో ఆల్మోస్ట్ 9 కోట్లు వచ్చినట్లు టాక్. మిగతా భాషల్లో ఇండియాలో 4 కోట్ల గ్రాస్ వచ్చిందని,  ఓవర్సీస్ లో 7 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. టోటల్ గా సరిపోదా శనివారం ఫస్ట్ డే కలక్షన్స్ 20 కోట్లని తెలుస్తోంది. ఈ వారం ఇంకే సినిమాలు లేకపోవటం వలన నాని మూవీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. పైగా వీకెండ్ కూడా కావటంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల విశ్లేషణ. 


మూవీ యూనిట్ సరిపోదా కలక్షన్లను ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఆఫ్టర్ వీకెండ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే దసరా సినిమా కంటే సరిపోదా కి తక్కువ కలక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నాని కెరీయర్లో అత్యధికంగా వసూల్ చేసిన మూవీ 'దసరా'. ఇది మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సరిపోదా శనివారం 20 కోట్లు అంటే చాలా తక్కువనే చెప్పాలి. మొదటి రోజు కలక్షన్స్ లెక్క దేముంది, టోటల్ కలక్షన్స్ ముఖ్యం అని కొందరి వాదన. నష్ఠాలు రాకుండా ఉంటే చాలని నిర్మాతలు అనుకుంటున్నారట.