ENGLISH

మ‌హేష్ Vs బ‌న్నీ... వార్ మ‌ళ్లీ మొద‌లు.

04 June 2020-14:28 PM

ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు పోటీ ప‌డ్డాయి. `స‌రిలేరు నీకెవ్వ‌రు`, `అల వైకుంఠ‌పుర‌ములో` బాక్సాఫీసు ద‌గ్గ‌ర నువ్వా నేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డ్డాయి. రెండు పెద్ద హీరోల సినిమాలు ఒక రోజు తేడాలో విడుద‌ల అవ్వ‌డం అభిమానుల‌కు సంతోషాన్ని క‌లిగించినా - బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను పంచుకోవాల్సి రావ‌డంతో నిర్మాత‌లు కాస్త ఇబ్బంది ప‌డ్డారు. సినిమా విడుద‌ల‌య్యాక క‌ల‌క్ష‌న్ల వివ‌రాలు చెప్ప‌డానికి రెండు సినిమాలూ పోటీ ప‌డ్డాయి. రికార్డు మాదంటే మాది అంటూ పోస్ట‌ర్ల సాక్షిగా కొట్టుకున్నారు.

 

ఇప్పుడు మ‌రోసారి మ‌హేష్, బ‌న్నీల వార్ చూడ‌బోతోంది టాలీవుడ్‌. మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`, బ‌న్నీ `పుష్ఫ‌` రెండూ ఒకేసారి, ఒకేసీజ‌న్‌లో విడుద‌ల కాబోతున్నాయి. 2021 వేస‌విలో ఈ చిత్రాల్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. రెండు సినిమాల మ‌ధ్య గ్యాప్ ఓ 15 రోజులు అటూ ఇటుగా ఉండొచ్చ‌ని టాక్‌. అంటే.. మ‌ళ్లీ వీళ్ల పోటీని చూడొచ్చన్న‌మాట‌. ఈసారి ఇద్ద‌రిలో ఎవ‌రు పై చేయి సాధిస్తారో మ‌రి..?

ALSO READ: బ‌న్నీ హీరోయిన్ కోసం చ‌ర‌ణ్ ప‌డిగాపులు