ENGLISH

సెహ్వాగ్ నోట‌.. బాహుబ‌లి మాట‌

05 June 2017-10:23 AM

బాహుబ‌లి.. అస‌లు ఈ పేరు తెలియ‌ని వ్య‌క్తులు ఉండ‌రేమో. సాక్షాత్తూ న‌రేంద్ర‌మోడీ సైతం బాహుబ‌లి పేరు ప్ర‌స్తావించి... అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ వంతు వ‌చ్చింది. ఈ డాషింగ్ ఓపెన‌ర్‌... ఇప్పుడు క్రికెట్ కామెంట్రేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండియా - పాక్ మ్యాచ్‌లోనూ సెహ్వాగ్ వ్యాఖ్యాత‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు. త‌న కామెంట్రీలో చాలా సార్లు బాహుబ‌లి పేరు ప్ర‌స్తావించాడు సెహ్వాగ్‌. అంతేకాదు..మ్యాచ్ అనంత‌రం రోహిత్ శ‌ర్మ‌తో ముచ్చ‌టిస్తూ.. 'క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసా?' అంటూ ప్ర‌శ్నించాడు.  సునీల్ గ‌వాస్క‌ర్ కూడా.. బాహుబ‌లి పేరు ప్ర‌స్తావ‌న‌కు తీసుకురావ‌డం విశేషం. మొత్తానికి ఇండియా - పాక్ మ్యాచ్‌లో కూడా బాహుబ‌లి పేరెత్త‌కుండా ఉండ‌లేక‌పోయారు. అదీ.. బాహుబ‌లి అంటే.

ALSO READ: ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- ఫ్యాషన్ డిజైనర్ సన్ అఫ్ లేడీస్ టైలర్ & అంధగ�