ENGLISH

ఆస్తుల్న‌నీ అమ్మి.. అప్పుల పాలైనా.. ఇద్ద‌రూ ద‌క్క‌లేదు

01 July 2021-10:00 AM

సీనియ‌ర్ న‌టి క‌విత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న భ‌ర్త ద‌శ‌ర‌థ రాజు బుధ‌వారం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు. కొన్నాళ్ల క్రితం ఆయ‌న క‌రోనా బారీన ప‌డ్డారు. ఆ త‌ర‌వాత కోలుకున్నా - ఫ‌లితం లేక‌పోయింది. ఇటీవ‌ల క‌విత కుమారుడు సైతం క‌రోనా బారీన ప‌డి చ‌నిపోయారు. ఇప్పుడు క‌విత త‌న భ‌ర్త‌ని సైతం కోల్పోయింది. వీరిద్ద‌రి వైద్యం నిమిత్తం క‌విత త‌న ఆస్తులన్నీ అమ్ముకుని, అప్పుల పాలైన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెప్పుకుంటున్నారు.

 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ( మా) ఈ కుటుంబాన్ని త‌న వంతుగా ఆదుకుంది. కొంత‌మంది సినీ సెల‌బ్రెటీలు ముందుకొచ్చి ఆర్థిక స‌హాయం కూడా చేశారు. కానీ భ‌ర్త ప్రాణాలు ద‌క్కించుకోలేక‌పోయింది. బాల న‌టిగా చిత్ర‌రంగ ప్ర‌వేశం చేసిన క‌విత దాదాపు 350 చిత్రాల్లో వివిధ పాత్ర‌ల‌లో అల‌రించింది. భ‌ర్త ద‌శ‌ర‌థ రాజు సింగ‌పూర్ లో వ్యాపారాలు చేసేవారు. ఆయ‌న మృతికి చిత్ర‌సీమ, ఇత‌ర ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

ALSO READ: మ‌హేష్ - త్రివిక్ర‌మ్‌.. మ‌రింత ఆల‌స్యం