ENGLISH

పాపం.. ష‌కీలాకి ఎంత క‌ష్టం వ‌చ్చింది

02 August 2021-13:38 PM

సోష‌ల్ మీడియాలో నిజాల కంటే.. పుకార్లే ఎక్కువ స్పీడుతో వ్యాప్తి చెందుతుంటాయి. ఏది నిజ‌మో.. ఏది అబ‌ద్ధ‌మో తెలుసుకునేలోగా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంటుంది. `ఫ‌లానా న‌టుడు చ‌నిపోయాడు` అంటూ బ‌తికుండ‌గానే శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించేస్తుంటారు. అలాంటి చేదు అనుభ‌వ‌మే ష‌కీలాకీ ఎదురైంది. ష‌కీలా చ‌నిపోయిందంటూ.. సోష‌ల్ మీడియాలో ఓ వార్త గ‌ట్టిగా హ‌ల్ చ‌ల్ చేసింది. ష‌కీలా అనారోగ్యం కార‌ణంగా మృతి చెందిందంటూ... క‌థ‌నాలు చ‌క్క‌ర్లు తిరిగాయి. వీటికి చెక్ పెట్టేందుకు ష‌కీలానే స్వ‌యంగా రంగంలోకి దిగాల్సివ‌చ్చింది. ``నేను చ‌నిపోలేదు. నా ఆరోగ్యం కాస్త దెబ్బ‌తిందంతే. ఇప్పుడు కోలుకుంటున్నా. ఎవ‌రూ నా ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందొద్దు. ఇలాంటి ఫేక్ వార్త‌ల్ని న‌మ్మొద్దు`` అంటూ సోష‌ల్ మీడియా ద్వారా ఓ సందేశం పంపింది. ఈమ‌ధ్య చంద్ర‌మోహ‌న్ ఆరోగ్యంపై కూడా ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. ఆయ‌న కూడా ఓ వీడియో బైట్ విడుద‌ల చేయాల్సివ‌చ్చింది. ఇప్పుడు ష‌కీలా వంతు వ‌చ్చింది. అయితే ష‌కీలా అనారోగ్యం పాలైన సంగ‌తి మాత్రం నిజ‌మే. మ‌రి.. ఆమెకు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయో..?

ALSO READ: ఇదేనా ఖ‌రీదైన పాట‌