ENGLISH

Shakuntalam: శాకుంత‌ల‌మ్ టీజ‌ర్ రెడీ!

20 September 2022-10:44 AM

గుణ‌శేఖ‌ర్ - స‌మంత‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'శాకుంత‌ల‌మ్‌'. ఈ సినిమాపై అటు గుణ‌శేఖ‌ర్‌, ఇటు స‌మంత చాలా ఆశ‌లే పెట్టుకొన్నారు. ఈ సినిమా పూర్త‌యి కూడా చాలా రోజులైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఎట్ట‌కేల‌కు శాకుంత‌ల‌మ్ ముందుకు క‌దులుతోంది. ఇప్పుడు శాకుంత‌ల‌మ్ టీజ‌ర్ రెడీ అయ్యింది. ద‌స‌రా సంద‌ర్భంగా 'శాకుంత‌ల‌మ్' టీజ‌ర్‌ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ బ‌య‌ట‌కు రావొచ్చు. ఈ టీజ‌ర్‌కు ఓ ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు వాయిస్ ఓవ‌ర్ అందించ‌బోతున్నార‌ని స‌మాచారం. బ‌హుశా.. రానాతో వాయిస్ ఓవ‌ర్ చెప్పించొచ్చు.

 

'హిర‌ణ్య క‌శ్య‌ప‌' సినిమా రానా - గుణ‌శేఖ‌ర్ కాంబోలో రావాల్సివుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా కొంత‌మేర జ‌రిగింది. అయితే రానా బిజీ షెడ్యూళ్లు, అనారోగ్యం వ‌ల్ల‌... 'హిర‌ణ్య క‌శ్య‌ప‌'కు ముహూర్తం సెట్ కాలేదు. 'శాకుంత‌ల‌మ్‌' పూర్త‌య్యాక త‌న డ్రీమ్ ప్రాజెక్టు మొద‌లెట్టాల‌ని గుణ‌శేఖ‌ర్ భావిస్తున్నాడు. 'శాకుంత‌ల‌మ్‌' కూడా పౌరాణిక నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డం తో.. `హిర‌ణ్య క‌శ్య‌ప‌`కు ఇదో ట్రైల‌ర్ లా భావించి ఉండొచ్చు.

ALSO READ: మ‌హేష్‌, చ‌ర‌ణ్‌ల‌పై ఫోక‌స్ చేసిన గౌత‌మ్ మీన‌న్‌