ENGLISH

రీమేక్‌లో మిల్కీ బ్యూటీని కాపీ కొట్టనంటే ఎలా?

17 October 2017-13:27 PM

'అర్జున్‌ రెడ్డి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ షాలినీ పాండే. చేసింది ఒక్క సినిమానే అయినా కానీ అమ్మడికి సూపర్‌ పాపులారిటీ వచ్చిన మాట అయితే వాస్తవమే. కానీ పాపులారిటీ వేరు. ఎక్స్‌పీరియన్స్‌ వేరు కదా. అది గమనించాలి ఈ ముద్దుగుమ్మ. ఎందుకు ఈ డిఫరెన్స్‌ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ '100 పర్సెంట్‌ కాదల్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తమన్నా, చైతూ జంటగా తెరకెక్కిన '100 పర్సెంట్‌ లవ్‌' సినిమాకి తమిళ రీమేక్‌. కాగా ఈ సినిమా గురించి ముచ్చటిస్తూ ముద్దుగుమ్మ షాలినీ పాండే ఈ సినిమాలో తమన్నాని తాను అస్సలు ఇమిటేట్‌ చేయననీ చెబుతోంది. నా స్టైల్‌ యాక్టింగ్‌ని మాత్రమే ఈ సినిమాలో చూపిస్తాననీ.. ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. '100 పర్సెంట్‌ లవ్‌' సినిమాకి తమన్నా మెయిన్‌ అట్రాక్షన్‌. మంచి నటి. అప్పటికే చాలా సినిమాలు చేసిన అనుభవం కూడా ఉంది తమన్నాకి. క్యూట్‌గా హాట్‌గా కనిపించింది. మహాలక్ష్మి పాత్రలో మేగ్జిమమ్‌ టాలెంట్‌ చూపించేసింది తమన్నా ఆ సినిమాలో. అలాంటప్పుడు తమన్నాని ఇమిటేట్‌ చేయనని షాలిని చెప్పడం ఏం బాగుంది చెప్పండి. అందులోనూ షాలినికి ఒకే ఒక సినిమాలో నటించిన అనుభవం మాత్రమే ఇప్పటికి. ఇవన్నీ పక్కన పెడితే, సినిమా స్టిల్స్‌ విషయానికి వస్తే, యాజ్‌ ఇటీజ్‌ దించేశారు. పోస్టర్స్‌ చూస్తుంటే, '100 పర్సెంట్‌ లవ్‌' సినిమానే తలపిస్తోంది. ఇదంతా చూస్తే, షాలినీ చెప్పిన మాటలు ఎంతవరకూ వాస్తవాలో.. ఆమెకే తెలియాలి. షాలిని చెప్పడం చెప్పింది కానీ, తమన్నాని ఇమిటేట్‌ చేయలేదంటే నమ్మేదెలా? సరే చెప్పిందిగా, చూడాలి మరి.

ALSO READ: వేస్య పాత్రలో సదా: చాలా రిస్క్‌ చేస్తోంది