ENGLISH

చైనీస్ లోకి అడుగుపెట్టిన శాన్వీ

05 October 2017-19:10 PM

కొంతమంది హీరోయిన్స్ కి అందంతో పాటు అభినయం తోడై ఉన్నా కూడా చిత్రాలలో సరైన బ్రేక్ దొరకదు. అలాంటి కోవలోకే నటి శాన్వీ కూడా చెందుతుంది.

ఆమె చేసిన సినిమాలు కొన్నే అయినా ఆమె అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ చిత్రాలు పెద్ద హిట్స్ కాకపోవడంతో ఆమెకి మన దగ్గర అవకాశాలు అంతగా రాలేదు. కాని ఆమె దశ ఇప్పుడు తిరిగినట్టుగానే కనిపిస్తుంది, ఎందుకంటే ఆమె చైనీస్ వెబ్ సిరీస్ అయిన ది డార్క్ లార్డ్ అనే దానిలో ఒక చైనా యువరాణి పాత్రకి ఈమె ఎంపిక అవ్వడం జరిగింది.

ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా తెలియచేసింది. దీనితి ఆమె ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిపోయింది.  ప్రస్తుతం ఆమె కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్నది.  

 

ALSO READ: దీపావళి నుండి థియేటర్ల బంద్