ENGLISH

శ‌ర్వానంద్‌పై రూ.40 కోట్లా??

06 June 2017-11:36 AM

యువ క‌థానాయ‌కుల్లో శ‌ర్వానంద్ కూడా దూకుడు చూపిస్తున్నాడు. ఈమ‌ధ్య విడుద‌లైన రాధ‌ని మిన‌హాయిస్తే... శ‌ర్వా రీసెంట్ రికార్డు అద్భుతంగా ఉంది. సంక్రాంతి వ‌చ్చిన శ‌త‌మానం భ‌వ‌తి ఏకంగా రూ.25 కోట్లు సాధించింది. శ‌ర్వా కెరీర్‌లో ఇదే రికార్డ్‌. అయితే.. శ‌ర్వాపై ఏకంగా రూ.40 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌డానికి నిర్మాత‌లు రెడీ అవుతున్నారు. కె.ఎస్‌.ప్ర‌కాష్ ద‌ర్శ‌కత్వంలో శ‌ర్వా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా పెట్టుబ‌డి రూ.40 కోట్ల‌ట‌. `బాహుబ‌లి` తీసిన ఆర్కా మీడియానే ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. బాహుబ‌లి బ‌డ్జెట్ విష‌యంలోనూ ఇలానే చిత్ర‌సీమ నోరెళ్ల‌బెట్టింది. కానీ.. ఆర్కా మీడియా న‌మ్మ‌కం నిజం అవుతూ ఆ సినిమా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టి... సెభాష్ అనిపించుకొంది. నిర్మాత‌ల‌కు భారీ లాభాల్ని మిగిల్చింది. అదే న‌మ్మ‌కంతో శ‌ర్వానంద్‌పై ఇంత భారీ పెట్టుబ‌డి పెట్ట‌డానికి రెడీ అవుతున్నారీ నిర్మాత‌లు.

ALSO READ: దాసరి పెద్దకర్మ వివరాలు