ENGLISH

శర్వా - సాయిపల్లవి స్టోరీ ఏంటంటే.!

15 June 2018-15:54 PM

శర్వానంద్‌ - సాయి పల్లవి జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విభిన్న కథా చిత్రాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్‌ 'రన్‌ రాజా రన్‌' సినిమాతో కామెడీ ట్రాక్‌ ఎక్కేసి, ప్రతీ పండక్కీ ఓ సినిమాతో వచ్చి, సైలెంట్‌గా హిట్‌ కొట్టుకెళ్లిపోతూ, ఫెస్టివల్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించేశాడు. 

తాజాగా శర్వా నటిస్తున్న చిత్రం 'పడి పడి లేచె' మనసుకి సంబంధించి తాజా అప్‌డేట్‌ ఒకటి హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి, శర్వానంద్‌ మధ్య లవ్‌ చిగురించే సమయానికి హీరోయిన్‌ తన గతం మర్చిపోతుందట. ఆ తర్వాత హీరో ఆమెకు గతాన్ని గుర్తుకు తెచ్చే పనిలో ఉంటాడట. ఈ కోణంలో హీరో, హీరోయిన్‌ మధ్య సాగే సన్నివేశాలు చాలా హృద్యంగా తెరకెక్కించడంతో పాటు, ఫన్‌ జనరేట్‌ అయ్యేలా ఉంటాయట. 

'అతిశుభ్రం' అంటూ 'మహానుభావుడు' సినిమాలో తన చేష్టలతో నవ్వులు పూయించిన శర్వానంద్‌, ఇప్పుడు తన ప్రియురాలికి గతంలో తనతో ఉన్న ప్రేమను గుర్తు చేయడానికి చేసే చేష్టలు ఆధ్యంతం నవ్వు తెప్పిస్తూనే, ఒక్కక్క చోట ఏడుపు కూడా తెప్పిస్తాయట. హీరో ఇంటెన్షన్‌ సగటు ప్రేక్షకుడికి ఈజీగా చేరువయ్యేలా హను ఈ స్టోరీని ప్రిపేర్‌ చేశాడట. 

ఇప్పటికే శర్వానంద్‌, సాయి పల్లవి తమ తమ ఫస్ట్‌లుక్స్‌తో కట్టి పడేశారు. ఇద్దరూ నేచురల్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్నవాళ్లే. తమదైన శైలిలో నటించి ఈ సినిమాతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలిక. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: సమ్మోహనం మూవీ రివ్యూ & రేటింగ్