ENGLISH

శిల్పా శెట్టికి దెబ్బ మీద దెబ్బ‌

24 July 2021-13:20 PM

ప్ర‌స్తుతం ముంబై మీడియా శిల్పాశెట్టి పై ఫోక‌స్ చేసింది. ఆమె భ‌ర్త రాజ్ కుంద్రా... ఆశ్లీల దందా న‌డుపుతూ అరెస్ట్ అవ్వ‌డంతో శిల్పా శెట్టిని కూడా అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అస‌లు శిల్ప ముంబైలో ఉందా?? విదేశాల‌కు పారిపోయిందా? అంటూ డిబేట్లు కూడా నిర్వ‌హిస్తున్నారక్క‌డ‌. భ‌ర్త చేసే వ్యాపారాల గురించి శిల్ప‌కు తెలుస‌ని కొంత‌మంది, అస‌లు ఆ వ్యాపార లావాదేవీల‌తో శిల్ప‌కు ప్ర‌మేయం ఏముంద‌ని ఇంకొంత‌మంది వాదిస్తున్నారు. భ‌ర్త‌ని అరెస్ట్ చేయ‌డంతో శిల్ప‌.. చాలా డీలా ప‌డిపోయింది. అయితే ఇప్పుడు శిల్ప‌కు మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది.

 

త‌న కొత్త సినిమా `హంగామా 2` అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. 14 ఏళ్ల త‌ర‌వాత‌..శిల్ప బాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. ఈమ‌ధ్య ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చినా కాద‌ని... `హంగామా 2` చేసింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. రెస్పాన్స్ ఏమంత బాగాలేదు. పైగా.. శిల్ప శెట్టి క్యారెక్ట‌ర్ కూడా గొప్ప‌గా లేద‌ని, ఈసినిమా చూశాక‌.. శిల్ప‌కు కొత్త‌గా అవ‌కాశాలు వ‌స్తాయ‌నుకోవ‌డం క‌ల్లే అని... కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా ప‌ర్స‌న‌ల్ గా.. ప్రొఫెష‌న‌ల్ గా.. శిల్ప‌కు దెబ్బ మీద దెబ్బ త‌గిలిన‌ట్టే.

ALSO READ: గ‌ప్ చుప్‌గా ప్రారంభ‌మైన ప్ర‌భాస్ సినిమా