తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. ఇప్పుడీ శివాజీ రావ్ గైక్వాడ్ పేరుని, రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా'లో ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రకి పెట్టబోతున్నారట. ఆ పాత్రలో తమిళ నటుడు అరవింద్ నటించనున్నాడు. ఈ సినిమాకి ఈ పాత్ర చాలా కీలకం. అలాగే ఈ పాత్రకి ఈ పేరు ఎందుకు పెట్టారో సినిమా చూస్తేనే అర్థమవుతుందట. ఆ పేరును ఈ పాత్రకి పెట్టడం వెన చాలా ఇంపార్టెన్స్ ఉందంటోంది చిత్ర యూనిట్. ఇంకో వైపున బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మరో ముఖ్యమైన పాత్రలో కన్పిస్తారు. నానా పటేకర్ పాత్ర పేరుని భీంజీగా ఖరారు చేశారట. ఇది దర్శకుడు పా రంజిత్ ట్విట్టర్ ఖాతా పేరు కావడం గమనించదగ్గది. ముంబైకి చెందిన అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దాంతో ఈ సినిమాలోని పాత్రల పేర్ల విషయంలో చిత్ర యూనిట్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'కబాలి' సినిమాని అనుకున్న రీతిలో తెరకెక్కించినప్పటికీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ సారి ఈ సినిమా విషయంలో పా రంజిత్ చాలా ఫుట్ వర్క్ చేశాడట. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు పా రంజిత్. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఈ సినిమాలో నటిస్తోంది.
ALSO READ: బోయపాటీ ఈ టైటిల్ ఏంటీ!