ENGLISH

శ్రద్ధా కపూర్‌కి గాలమేస్తున్న మరో టాలీవుడ్‌ హీరో

04 October 2017-18:46 PM

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ 'సాహో' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్‌లోనూ నటించేందుకు ఇంట్రెస్ట్‌ చూపించింది ఈ బ్యూటీ. అదే నటనకు భాషతో సంబంధం లేదంటోంది. అదే నటనపై ఆమెకున్న డెడికేషన్‌ అని చెప్పాలి. అంతేకాదు, సినిమాలో ఆమె పాత్ర కోసం చాలా కష్టపడుతుంది కూడా. పాత్రకి ప్రాణం పెట్టడానికి తనని తాను మౌల్డ్‌ చేసేసుకుంటుందలా. అదే శ్రద్ధా స్పెషాలిటీ. అందుకే ఆ డెడికేషన్‌కే ఆమెతో నటించేందకు హీరోలు కూడా అంతే ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. ప్రబాస్‌కి జోడీగా 'సాహో' సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ తెలుగు భాష నేర్చుకునేందుకు కసరత్తులు చేస్తుందట. మరో పక్క బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ సైనా నెహ్మాల్‌ బయెపిక్‌లో నటిస్తోంది. ఇందుకోసం నిజంగానే బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటోంది. అదీ శ్రద్ధా అంటూ. ఎలాగూ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేసింది. ఆమె కోసం దర్శక, నిర్మాతలు, హీరోలు ఇప్పటికే గాలమేయడం మొదలెట్టేశారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరో సినిమాలో శ్రద్ధాని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు ఇప్పటికే ఫుల్‌ బిజీగా ఉన్న శ్రద్దా కపూర్‌ ఈ ఆఫర్‌ని స్వీకరిస్తుందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే మరి కొంచెం టైం పట్టే అవకాశాలున్నాయని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల సమాచారమ్‌.

ALSO READ: రెండవ పెళ్ళి పై రేణు దేశాయ్ పోస్ట్ రేపిన కలకలం