ENGLISH

ఆ ఉద్దేశ్యం లేదంటున్న శ్రద్ధా కపూర్‌

16 October 2020-18:00 PM

ఇప్పట్లో మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ అంటోందట. టాలీవుడ్‌ నుంచి ఓ ప్రముఖ నిర్మాత ఇటీవల శ్రద్ధా కపూర్‌ని సంప్రదిస్తే, అట్నుంచి వచ్చిన సమాధానంతో సదరు నిర్మాతకి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందట. ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ సరసన నటించిన శ్రద్ధా కపూర్‌కి అదే తొలి తెలుగు సినిమా.

 

‘ఇకపై వీలున్నప్పుడల్లా తెలుగులోనూ సినిమాలు చేస్తాను..’ అంటూ ‘సాహో’ ప్రమోషన్ల సందర్భంగా వ్యాఖ్యానించిన శ్రద్ధా కపూర్‌ ఇప్పుడెందుకిలా ‘రాంగ్‌ టర్న్‌’ తీసుకుందో ఎవరికీ అర్థం కావడంలేదు. అయితే, ‘ఆమె ఉద్దేశ్యం, తెలుగు  సినిమాలు చేయకూడదని కాదు. ప్రస్తుతానికి బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా వుంది కాబట్టి, తెలుగు సినిమాలు చేసేందుకు ఆమె వద్ద డేట్స్‌ లేవు..’ అంటూ కొందరు శ్రద్ధా కపూర్‌ని వెనకేసుకొస్తున్నారు. 

 

ఇదిలా వుంటే, శ్రద్ధ వల్ల ‘సాహో’ సినిమాకి తెలుగునాట అదనంగా ఒరిగిందేమీ లేదు. పోనీ బాలీవుడ్‌ వెర్షన్‌కి అయినా ఆమె ఇమేజ్‌ కలిసొచ్చిందా.? అంటే అదీ లేదు. సో, శ్రద్ధా కపూర్‌ విషయంలో టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు అంత ‘ఎక్స్‌ట్రా ఫోకస్‌’ పెట్టాల్సిన అవసరమే లేదన్నది చాలామంది అభిప్రాయం. అలాగని శ్రద్ధ టాలెంట్‌ని తక్కువ చేయలేం. కాకపోతే, ఆమె వల్ల తెలుగు సినిమాలకు అదనపు గ్లామర్‌ లేదు గనుక, ఆమె ప్లేస్‌లో అంతకంటే ఫాలోయింగ్‌ తెలుగులో వున్న బ్యూటీస్‌కి ఛాన్స్‌ ఇవ్వడం బెటర్‌.!

ALSO READ: సంజూ.. ఎంట్రీ ఇచ్చాడండోయ్‌!