ENGLISH

ఆ ముగ్గురూ హీరోయిన్లేనట

10 June 2017-17:53 PM


బాలయ్య కొత్త చిత్రానికి 'పైసా వసూల్‌' అనే టైటిల్‌ పెట్టి ఫ్యాన్స్‌ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు డైరెక్టర్‌ పూరీ. పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌లో తొలిసారిగా బాలయ్య నటిస్తున్న చిత్రమిది. బాలయ్యకు 101వ చిత్రం. ఇంతవరకూ బాలయ్య నటించిన చిత్రాలన్నింటికీ పూర్తి విభిన్నంగా ఉండబోతోందట ఈ సినిమా. ఈ సినిమాలో బాలయ్య నటన, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయట. ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయబోతున్నాడు బాలయ్య ఈ సినిమాలో. శ్రియ, ముస్కాన్‌, కైరా దత్‌ ఈ ముగ్గురూ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ముస్కాన్‌ మాత్రమే మెయిర్‌ హీరోయిన్‌, శ్రియ గెస్ట్‌ రోల్‌లో నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. కైరా దత్‌ ఐటెం సాంగ్‌ చేయనుందనీ అన్నారు. కానీ ఈ ముగ్గురూ హీరోయిన్సే అని పూరీ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ సినిమాతో తొలి సారిగా బాలయ్య తన గొంతు సవరించుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య ఓ పాట పాడారు. ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తయిపోయిందట. ఈ పాట మందు పాట అని పూరీ చెప్పారు. అంతేకాదు ఈ పాటే ఈ సినిమాకి పెద్ద ఐటెం సాంగ్‌ అని కూడా ఆయన అన్నారు. అంతేకాదు సెట్‌లో బాలయ్య ఎనర్జీకి అంతా షాకవుతున్నారట. డాన్సులు, ఫైట్లు ఇరగదీసేస్తున్నారట బాలయ్య. రిస్కీ షాట్స్‌ కూడా డూప్స్‌ లేకుండా నటించేస్తున్నారట బాలయ్య. సెప్టెంబరు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన పోర్చుగల్‌లో షూటింగ్‌లో ఉన్నారు. అక్కడే చిత్ర యూనిట్‌ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

 

ALSO READ: కూతురుగా నటించి ఇప్పుడు భార్యగా నటిస్తుందా?